క‌బాలిని చంపేశారా??

ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న క‌బాలి విడుద‌లైంది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర అప్పుడే డివైడ్ టాక్ మొద‌లైంది. ఈ సినిమా చూసి నొస‌లు చిట్లిస్తున్న‌వాళ్లే ఎక్కువ‌. సినిమా మొత్తం ఎలాగున్నా… క్ల‌యిమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌బాలి హ్య‌పీ ఎండింగ్ అనుకొంటున్న స‌మ‌యంలో టైగ‌ర్ అనే పాత్ర‌ధారి ఎంట‌రై.. గ‌న్ గురిపెడ‌తాడు. వెంట‌నే స్క్రీన్ మొత్తం న‌ల్ల‌గా మారిపోయింది. పిస్తోలు శ‌బ్దాలు వినిపిస్తాయి. అంటే అక్క‌డ కాల్పులు జ‌రిగాయ‌న్న‌మాట‌. అయితే ఎవ‌రు ఎవ‌రిని కాల్చారు? ఎందుకు అన్న‌ది సస్పెన్స్ అన్న‌మాట‌. అంటే.. పార్ట్ 2 కోసం ద‌ర్శ‌కుడు రంజిత్ ఇక్క‌డే త‌న గేమ్ స్టార్ట్ చేశాడ‌న్న‌మాట‌.

క‌బాలి క్ల‌యిమాక్స్ గురించి అంత‌కు ముందు ర‌క‌ర‌కాల ఊహాగానాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇది శాడ్ ఎండింగ్ అని, చివ‌ర్లో ర‌జ‌నీకాంత్ చ‌నిపోతాడ‌ని చెప్పుకొన్నారు. ఆ లెక్క‌న టైగ‌ర్ కాల్పులు జ‌రిపింది క‌బాలిపైనే అన్న‌మాట‌. ఈ సినిమా హిట్ట‌యితే పార్ట్ 2 క‌థ అక్క‌డి నుంచే మొద‌ల‌య్యేదేమో? ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు లెండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close