తెలకపల్లి వ్యూస్: హెచ్‌సియు లో ‘జూనియర’్‌ ఫిరాయింపులు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎస్‌ఎప్‌ఐ తరపున ప్రధాన కార్యదర్శిగా గెలిచి ఇప్పటి వరకూ విద్యార్థి పోరాటంలో పాల్గొంటున్న రాజ్‌కుమార్‌ సాహు సంస్థకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం కొత్త తరహా ఫిరాయింపు క్రీడలకు తెరతీసింది.అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖ:డ్‌లలో ఫిరాయింపులను ప్రోత్సహించిన మాతృసంస్థ బిజెపి అనుభవం చూసి ఉత్తేజపడిన అనుబంధ ఎబివిపిని కూడా విద్యాలయాల్లోనూ వాటిని ప్రవేశపెట్టినట్టు కనిపిస్తుంది.దీనివల్ల వాతావరణం కలుషితం అవడమే తప్ప ఒరిగేది వుండదు. ఎస్‌ఎప్‌ఐకి ఇది ఇబ్బందికరమే కూడా. ఎందుకంటే కీలకమైన ప్రధాన కార్యదర్శి స్థానం పోవడమే గాక తన విమర్శలను కూడా ఎదుర్కోవలసిస పరిస్థితి. ఇప్పటికే సాహును బహిష్కరించినట్టు ఎస్‌ఎప్‌ఐ ప్రకటించింది. రోహిత్‌ వేముల మరణం తర్వాత సాగుతున్న ఆందోళనలో గట్టిగా పొల్గొన్న రాజ్‌కుమార్‌ సాహు విసి అప్పారావును తొలగించాలని తీర్మానం కూడా ప్రతిపాదించారు. అలాటి విద్యార్థి నాయకుడు ఇప్పుడు విసికి అనుకూలంగానూ విద్యార్థి సంఘాలకు వ్యతిరేకంగానూ మాట్లాడటానికి కొన్ని కారణాలున్నాయంటున్నారు. . తన డిపార్టుమెంటులో విసి అనుకూల అధ్యాపకుల ఒత్తిళ్లు బెదిరింపులు ఇందుకు దారితీశాయని ఇతర విద్యార్థులంటున్నారు.

విసి తిరిగివచ్చినప్పుడు జరిగిన నిరసనలో రాజ్‌కుమార్‌ సాహు పాల్గొన్న ఒక ఫోటో చేజిక్కుంచుకుని దాని ఆధారంగా బెదిరించినట్టు సమాచారం. ఒకసారి చర్యకు గురైతే భవిష్యత్తు నాశనమైపోతుందని బయపెట్టడంతో స్వతహాగా బాగా చదువుకునే సాహు వారు చెప్పినట్టు వినడానికి అంగీకరించారని తెలుస్తున్నది.అయితే , ఉద్యమానికి రాజకీయ పార్టీలు పెట్టుబడులు పెడుతున్నాయని నిందలు వేయడం తోటి విద్యార్థులను అవమానించడమేనని వారు ఆగ్రహిస్తున్నారు.అన్యాయంగా హాస్టళ్లు మూసివేసి రోడ్డుపై నెట్టినప్పుడు అన్నం వండిపెట్టడం ఎవరు చేసినా అందులో పొరబాటు లేదు. . బయిటకు వెళ్లడాన్ని సమర్థించుకోవడానికి సాహు ఈ మాటలు చెబుతుండొచ్చు. అతన్ని బహిష్కరిస్తూ ఎస్‌ఎప్‌ఐ చేసిన నిర్ణయంపైనా విమర్శలు వుండొచ్చు. కాని సామాజికన్యాయం కోసం జరిగే ఉద్యమం కిరాయిఉద్యమంగా చిత్రించడం మాత్రం పొరబాటే. సాహు వీసీని ఇంతగా వెనకేస్తున్నప్పటికీ ఆయన పోలీసు బలగాలు లేకుండా విధులు నిర్వహించే పరిస్థితి లేదు. అత్యధిక సమయం విడిదినుంచే పనిచేస్తూ ఎప్పుడైనా పహారాతో అధికార కార్యక్రమాలు చేశాననిపిస్తున్నారు. రాజ్యాంగబద్దమైన విలువలు పాటించాలంటున్న రాజ్‌కుమార్‌ ఆ ప్రకారమైతే ఎస్‌ఎప్‌నుంచిదూరం అవుతున్నప్పుడు దానితరపున తాను గెలిచిన ప్రధాన కార్యదర్శి పదవిని వదలిపెట్టడం కనీస ధర్మంకదా అని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close