జగన్ తో రాజ్ నాథ్ సింగ్ సమావేశం వెనుక మర్మమేమిటో?

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపిలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వర ప్రసాద్ లను వెంటబెట్టుకొని నిన్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వగైరా హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు. హోం మంత్రితో వారు చాలాసేపు మాట్లాడారు. కానీ ఇవి కాక ఇంకా వేటి గురించి వారు మాట్లాడుకొన్నారో, ప్రత్యేక హోదా తదితర హామీలపై హోం మంత్రి వారికి ఏమని సమాధానం చెప్పారో తెలియదు.

ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అడిగిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వగైరా ఇచ్చేసే ఉద్దేశ్యం, అవకాశమే ఉన్నట్లయితే అదేదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగినప్పుడే ఇచ్చేసేవారు కదా? లేదా జగన్మోహన్ రెడ్డి వాటి కోసం డిల్లీలో, గుంటూరులో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినప్పుడయినా ఇచ్చి ఉండేవారు కదా? కానీ ప్రధాని నరేంద్ర మోడితో సహా బీజేపీ మంత్రులు ఎవరూ ఆ ఊసే ఎత్తడం లేదంటే వారికి ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం అవుతోంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదనుకోలేము. అయినా హడావుడిగా డిల్లీ వెళ్లి పనిగట్టుకొని అందరినీ కలుస్తున్నారంటే ఆయన తెదేపా నేతలు ఆరోపిస్తున్నట్లు తన స్వంత పనుల కోసం వారిని కలవడానికి దానినొక సాకుగా చూపుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. పైగా చంద్రబాబు నాయుడుకి ఈ విషయంలో శ్రద్ధచూపకపోయినా తాను చూపిస్తున్నాని ప్రజలకి చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

జగన్మోహన్ రెడ్డి తన సిబిఐ కేసులను మాఫీ చేయించుకోవడానికే డిల్లీ వెళుతుంటారని తెదేపా నేతలు ఆరోపిస్తుంటారు. ఆయన డిల్లీ వెళ్లినప్పుడల్లా మీడియాలో ఇటువంటి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉంటున్నాయి. కానీ వాటిని ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు. అలాగే తెదేపా నేతల ఆ కేసుల మాఫీ ఆరోపణలను కేంద్రప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఏడాదికి రెండు మూడు సార్లు డిల్లీ వెళ్తూనే ఉన్నారు. ఆయనకు రాష్ట్రపతితో సహా ప్రధాని, కేంద్రమంత్రులు అందరూ కోరినప్పుడల్లా అపాయింట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కనుక అపాయింట్మెంట్స్ ఇస్తున్నారని సర్ది చెప్పుకొన్నప్పటికీ, బీజేపీ భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలద్రోస్తామని, త్వరలో పడిపోతుందని చెపుతున్న జగన్మోహన్ రెడ్డికి అంత ఉదారంగా కోరిన వెంటనే అపాయింట్మెంట్స్ ఇస్తుండటం, అతనితో అంత సావకాశంగా చర్చలు సాగించడం చూస్తుంటే వారి సమావేశానికి ప్రత్యేక హోదా ఒక సాకు మాత్రమేననే అనుమానం కలుగుతోంది.

సోము వీర్రాజు, కన్నా లక్ష్మి నారాయణ, పురందేశ్వరి వంటి బీజేపీ నేతలు తరచూ తెదేపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వారేదో యధాలాపంగా విమర్శలు చేస్తున్నారనుకోవడానికి లేదు. తాత్కాలిక పధకాలు, పనుల కోసం తెదేపా ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చులు, రాష్ట్రంలో కాల్ మనీ, ఇసుక మాఫియా, అవినీతి వంటి అంశాలపై జగన్ చేస్తున్న విమర్శలను, ఆరోపణలను రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరూ ఖండించకపోగా వారు కూడా అతనితో అప్పుడప్పుడు గొంతు కలపుతుండటం గమనిస్తే, వారు తమ అధిష్టానం అభిప్రాయాలనే చెపుతున్నట్లుగా భావించవచ్చును.

తెదేపా ప్రభుత్వంపై తమ నేతలు విమర్శలు చేస్తున్నప్పటికీ బీజేపీ అధిష్టానం వారిని ఎన్నడూ వారించే ప్రయత్నం చేయకపోవడం గమనిస్తే, వారికి అధిష్టానం ఆమోదం ఉందనే సంగతి స్పష్టమవుతోంది. తెదేపాను విమర్శిస్తున్న వారిలోనే ఎవరో ఒకరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక సరయిన సమయం చూసుకొని తెదేపాతో తెగతెంపులు చేసుకొని, జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి, రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి రాష్ట్రంలో తెదేపాకు చెక్ పెట్టాలని బీజేపీ అధిష్టానం సిద్దం అవుతోందేమో? కనుక చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా ఉండటం మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close