ఏపీకి కొత్త ఎన్నికల అధికారి .. ! ఆయన జుట్టు రాజ్‌నాథ్‌ చేతిలోనే..!?

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అధికార వర్గాల్లో మార్పులు…కూడా అనూహ్యంగా చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన అధికారిగా ఆర్పీ సిసోడియాను.. ఉన్న పళంగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా గోపాలకృష్ణ ద్వివేదీ అనే అధికారిని నియమించారు. కొద్ది రోజులుగా ఏపీ ఎన్నికల అధికారి సిసోడియాపై… వైసీపీ నేతలు అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవతకవకలంటూ.. పలుమార్లు.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చారు. అదే తరహా ఆరోపణలు …. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆధారాలతో సహా… కోర్టులో పిటిషన్లు వేసింది. అయినప్పటికీ.. అక్కడి ఎన్నికల అధికారిని మార్చే ఆలోచన కూడా చేయలేదు. కానీ ఉన్న పళంగా ఏపీ ఎన్నికల అధికారిని కేంద్రం ఎన్నికల ప్రకటనకు రాక ముందే మార్చేసింది.

సిసోడియా స్థానంలో నియమితులైన గోపాలకృష్ణ ద్వివేదీ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారినే. అయితే.. ఆయన చాలా కాలంగా కేంద్ర సర్వీస్లులో ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖలో పని చేస్తున్నారు. ఈ అధికారి జుట్టు ఇప్పుడు ఓ కేసు విషయంలో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గుప్పిట్లో ఉంది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ మత గరువు జకిర్ నాయక్ అలియాస్ జకీర్ అబ్దుల్ కరీం నాయక్ సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ విదేశాల నుంచి నిధులు రావడానికి అవసరమైన కొన్ని అనుమతులు.. అక్రమంగా ఇచ్చారనే ఆరోపణలపై.. ఆయనను గతంలో సస్పెండ్ చేశారు. అయితే.. ఆ తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తి వేశారు. కానీ ఆ వ్యవహారం.. కేంద్రం హోంమంత్రి గుప్పిట్లోనే ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ద్వివేదీ.. ఏపీ ఎన్నికల అధికారిగా.. బీజేపీ నుంచి వచ్చే ఆదేశాలను పాటించాల్సిందేనన్న అభిప్రాయాలున్నాయి.

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని… బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు. టీడీపీకి 30 సీట్లు కూడా రానివ్వబోమని అంటున్నారు. దాని ప్రకారం రాజకీయంగా అమలు చేయాల్సిన వ్యూహాలను అమలు చేస్తున్నారు. కొత్తగా అధికార పార్టీగా తమకు ఉన్న అడ్వాంటేజ్‌లను వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ వ్యూహంలో భాగంగానే… గోపాలకృష్ణ ద్వివేదీ నియామకం జరగిందన్న అనుమానాలు టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]