రాజుగారి గ‌ది 2… వెంకీ కోస‌మే

ఓంకార్ సినిమా రాజుగారి గ‌ది.. చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం సాధించింది. రూ.3 కోట్ల‌తో పూర్త‌యిన ఈ చిత్రం దాదాపు రూ.9 కోట్ల వ‌ర‌కూ వసూళ్లు ద‌క్కించుకొంది. ఈసినిమాకి సీక్వెల్ చేయాల‌న్న‌ది ఓంకార్ ఆలోచ‌న‌. స్క్రిప్టు కూడా సిద్ధ‌మైంది. ఓ త‌మిళ హీరోకి వినిపించి డేట్లు తీసుకొందామ‌నుకొన్నాడు ఓంకార్‌. త‌మిళ హీరో అయితే ఈ సినిమాని త‌మిళంలోనూ మార్కెట్ వ‌స్తుంద‌ని భావించాడ‌ట‌. అయితే ఇప్పుడు ఆ క‌థ వెంక‌టేష్ ద‌గ్గ‌ర‌కు చేరింది. రాజుగారి గ‌ది సినిమాని చూసిన వెంకీ.. ఓంకార్‌ని పిలిపించుకొని ‘ఓ క‌థ ఉంటే చెప్పు…’ అని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు టాక్‌. రాజుగారి గ‌ది 2 క‌థ‌ని వెంకీకి ఓంకార్ చెప్పాడ‌ని, దానికి వెంకీ బాగా క‌నెక్ట్ అయిపోయాడ‌ని తెలుస్తోంది.

వెంకీ సినిమా బాబు బంగారం ఆగ‌స్టు 12న విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత సాలా ఖుద్దూస్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఆసినిమాకి మూడు నెల్ల‌లో పూర్తి చేయాల‌న్న‌ది వెంకీ ఆలోచ‌న‌. ఆ వెంట‌నే రాజుగారి గ‌ది 2 సెట్స్‌పైకి వెళ్తుంద‌ని టాక్‌. ఓ హార‌ర్‌సినిమాలో వెంకీ న‌టించ‌డం ఇదే తొలిసారి. టాలీవుడ్ లోని అగ్ర‌హీరో.. హార‌ర్ సినిమాలో న‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. హార‌ర్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా… పెద్ద హీరోలు సైతం ఈ జోన‌ర్‌లో సినిమాలు చేయ‌డానికి మొగ్గు చూప‌డం విచిత్ర‌మే మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close