రాజుగారి గ‌దిలో.. కట్ట‌యిపోయిన సీన్లెన్నో…!

‘రాజుగారి గ‌ది 2’కి రిపేర్లు మామూలుగా జ‌ర‌గ‌లేదు. షూటింగ్ మొత్తం పూర్త‌యిన త‌ర‌వాత, రీషూట్లు చేయాల్సివ‌చ్చింది. ఇదంతా సినిమా అవుట్‌పుట్ కోస‌మే అని నాగార్జున సైతం స్వ‌యంగా సెల‌విచ్చిన త‌ర‌వాత‌… రీషూట్ల వ్య‌వ‌హారం నిజ‌మే అని తేలిపోయింది. మ‌రీ ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో కీల‌క‌మైన మార్పులు చాలా జ‌రిగాయ‌ట‌. కామెడీ బిట్లు చాలానే లేచిపోయాయ‌ని స‌మాచారం. ఇటీవ‌ల విడుద‌లై, విజ‌యాలు సాధించిన కొన్ని సినిమాల‌పై స్నూఫ్‌లు చేశాడ‌ట ఓంకార్‌. ష‌క‌ల‌క శంక‌ర్‌పై చేసిన పేర‌డీ బిట్లు హిలేరియ‌స్‌గా పండాయ‌ని తెలుస్తోంది. అయితే.. క‌థ ప‌క్క‌దోవ ప‌డుతోంద‌ని, ర‌న్ టైమ్ కూడా ఎక్కువ తినేస్తోంద‌న్న ఉద్దేశంతో ఆ బిట్ల‌న్నీ నాగ్ ద‌గ్గ‌రుండి క‌త్తెర వేశాడ‌ని టాక్‌.

ఈ విష‌యంలో ఓంకార్ కూడా కాస్త‌నొచ్చుకొన్నాడ‌ట‌. రాజుగారి గ‌ది విజ‌య‌వంతం అవ్వ‌డానికి కామెడీ బాగా హెల్ప్ చేసింద‌ని, పార్ట్ 2లోనూ దాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తార‌ని ఓంకార్ న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌. కానీ నాగ్ ఒప్పుకోలేద‌ని, కేవ‌లం నాగ్ బ‌ల‌వంతంపైనే కామెడీ బిట్లు క‌ట్ చేయాల్సివ‌చ్చింద‌ని టాక్‌. సినిమా ఇప్పుడు బాగానే ఆడుతోంది. వ‌సూళ్లూ వ‌స్తున్నాయి. ఎలాగూ హిట్ టాక్ వ‌చ్చేసింది కాబ‌ట్టి – త్వ‌ర‌లో సీన్లు క‌లుపుతారేమో చూడాలి. అయితే ఇది వ‌ర‌క‌టిలా ఇప్పుడు సీన్లు క‌ల‌ప‌డం పెద్ద క‌ష్ట‌మేం కాక‌పోయినా, ఖ‌ర్చుతో కూడిన వ్య‌వ‌హారం. దాన్ని త‌ట్టుకొంటామంటే రాజుగారి గ‌దిలో కొత్త సీన్లు చూసే అవ‌కాశం వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.