వర్మపై సెటైర్లు వేసిన శిష్యురాలు

‘వాళ్ళంతే… అప్‌డేట్‌ అవ్వరండీ!’ అంటూ ఒక్క ముక్కలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ గురించి, ప్రేమ చిత్రాల స్పెషలిస్ట్ మణిరత్నం గురించి మనసులో మాటను చెప్పేశారు దర్శకురాలు సంజానారెడ్డి. రాజ్‌త‌రుణ్ ‘రాజుగాడు’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారీమె. అంతేకాదు… దర్శకుడు వర్మతో పరిచయం నా ఆలోచనా దృక్పథాన్ని, నా భవిష్యత్తుని మార్చిందని చెప్పుకొచ్చిన సంజానారెడ్డి అదే దర్శకుడి మీద సెటైర్లు వేయడం గమనార్హం. ‘రాజుగాడు’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాకి దర్శకురాలు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వర్మ గురించి గొప్పగా చెప్పారు. వర్మ ఎంతసేపూ సినిమాల గురించి ఆలోచిస్తారని, సినిమా పుస్తకాలు చదువుతారని, ఖాళీ సమయాల్లో సినిమాలు చూస్తారని చెప్పారు. వర్మ సినిమాల ప్రస్తావన వచ్చేసరికి “వర్మ బలం టెక్నాలజీ. ‘శివ’ సినిమాకు అంత పేరు రావడానికి, అప్పట్లో ఆయన సినిమాలు హిట్ కావడానికి కారణం టెక్నాలజీయే. తరవాత తరవాత ఆయన్ను ఆదర్శంగా తీసుకొని చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అంతకంటే కొత్త టెక్నాలజీతో సినిమాలు తీస్తున్నారు. ఎప్పుడో ‘శివ’ టైమ్‌లో టెక్నాలజీని ఇప్పటి ప్రేక్షకులు చూపిస్తే ఎలా?” అన్నారు. అలాగే, మణిరత్నం గురించీ మాట్లాడారు. “ఉదాహరణకు… ప్రేమకథలను అందంగా చూపించడం మణిరత్నంగారి బలం. ఈతరం దర్శకులు అంతకంటే అందంగా ప్రేమకథలను చూపిస్తున్నారు. దాంతో ఆయన కథలు కొత్తగా కనిపించడం మానేశాయి. ఒకవేళ ఆయన వేరేలా తీస్తే ‘ఇందులో మణిరత్నం మార్క్ లేదు’ అని అంటారు. ఆయనలా తీస్తే బోర్ అంటారు. అసలు, ‘ఒకే బంగారం’ హిట్ అవుతుందని ఎవరైనా అనుకున్నారా? ఫ్లూక్‌లో ఆడేసింది” అని సంజనారెడ్డి చెప్పారు. ‘కాలానికి తగ్గట్టు అప్‌డేట్‌ కావాలి కదా?’ అని ఆమెను ప్రశ్నిస్తే “వాళ్ళంతే… అప్‌డేట్‌ అవ్వరండీ! సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి వాళ్ళకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ వుంటుంది. అలాగే సినిమాలు తీస్తారు” అని అన్నారు.

అన్నట్టు…. నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వం వహించిన, నిర్మించిన ‘ఆఫీసర్’ని జూన్ 1న విడుదల చేస్తున్నారు. వర్మ శిష్యురాలు సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న ‘రాజుగాడు’ కూడా అదే రోజున వస్తుంది. ‘గురువుగారితో పోటీ పడుతున్నారేంటి?’ అని ఆమెను అడగ్గా… “అదేం లేదండీ. అలా కుదిరింది అంతే. మా సినిమా ఎప్పుడో రెడీ అయ్యింది. విడుదల కోసం మంచి డేట్ చూసి ఇప్పుడు చేస్తున్నాం. ప్రేక్షకులు రెండు సినిమాలూ చూస్తారు” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ విషయంలో కేసీఆర్‌ నెంబర్ వన్ !

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన...

హతవిధీ… వైసీపీకి ఏమిటీ దుస్థితి..!?

జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం...

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close