రకుల్ మీద ఆ ముద్ర పోయిన‌ట్టేనా..?

ర‌కుల్ ప్రీత్ సింగ్.. మొన్న‌టి వ‌ర‌కు ల‌క్కీ హీరోయిన్. నిన్న‌టి వ‌ర‌కు అన్ ల‌క్కీ అమ్మ‌డు. 2015లో ఆమె న‌టించిన మూడు సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో ఆమె మీద ఐర‌న్ లెగ్ ముద్ర ప‌డింది. పండ‌గ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ మూడు సినిమాలు మెగా ఫ్లాప్ లు కావ‌డంతో.. ర‌కుల్ అన్ ల‌క్కీ అనే ట్యాగ్ త‌గిలించేశారు. అయితే ఇప్పుడు నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకి హిట్ టాక్ రావ‌డంతో.. ఈ పంజాబీ భామ‌కి మ‌ళ్లీ పాత రోజులు వ‌స్తాయి. ఐర‌న్ లెగ్ ముద్ర తుడిచిపెట్టుకుపోతుంద‌ని ఆశ‌లు పెట్టుకుంది.

అస‌లు నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో విజ‌యం కోసం ఎంతో కృషిచేసింది ర‌కుల్. తెలుగు నేర్చుకుని మ‌రీ.. ఎంతో క‌ష్ట‌ప‌డి.. త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. పైగా.. గ‌త సినిమాల్లా కాకుండా.. న‌ట‌న‌కు కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్ చేసింద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ లో ర‌కుల్ న‌ట‌న‌.. అద్భుతం అంటున్నారు. దీంతో సినిమా సక్సెస్ పట్ల హీరో దర్శకుడు కన్నా ర‌కుల్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతోంది.

పైగా తెలుగు వారికి, టాలీవుడ్ కి సెంటిమెంట్ లాంటి సంక్రాంతి పండుగకి హిట్ తో ఖాతా తెర‌వ‌డంతో.. ఈ ఏడాది అంతా బావుంటుంద‌ని ఆశ‌లు పెట్టుకుంది. నాన్న‌కు ప్రేమ‌తో ఎఫెక్ట్ తో మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అంచ‌నాలున్నాయి. ర‌కుల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేద్దామ‌నుకున్న చాలా మంది ద‌ర్శ‌కనిర్మాత‌లు, హీరోలు కూడా.. ఈ సినిమా చూసి.. ఆ త‌ర్వాత ఓ నిర్ణ‌యం తీసుకుందామ‌నుకున్నారు. ఇప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా అగ్రిమెంట్లు చేసుకోవ‌డానికి చాన్స్ ఉంది. అయితే.. దొరికిందే చాన్స్ అన్న‌ట్టుగా.. ఈ అమ్మ‌డు కూడా భారీగానే వ‌సూలు చేసేయ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close