రకుల్ బ్యాడ్‌ల‌క్‌

తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న ర‌కుల్‌ప్రీత్‌ సింగ్‌కి హిందీలో కూడా జెండా ఎగరేయాలని ఎప్పటి నుంచో కోరిక. కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ‘యారియన్’ చేసింది. సినిమా పర్వాలేదనే పేరొచ్చినా రకుల్‌కి ఛాన్సులు రాలేదు. ఈలోపు తెలుగులో ఫుల్ బిజీ అయ్యింది. ఇక్కడి స్టార్ హీరోలు అందర్నీ కవర్ చేసిన తర్వాత హిందీ మీద కాన్సంట్రేట్ చేసింది. ‘సిమ్లా మిర్చి’లో ఛాన్స్ వచ్చింది. రాజ్‌కుమార్ రావ్, హేమా మాలిని కో-స్టార్స్… రమేష్ సిప్పీ డైరెక్షన్… క్రేజీ ప్రాజెక్ట్టే కానీ రిలీజ్ కాకుండా షెడ్డులో పడింది. తర్వాత జాగ్రత్తగా ఆలోచించి హ్యాపెనింగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘అయ్యారీ’ చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి హిందీలో ఫ్లాప్ టాక్ వచ్చింది.

జనవరి 26న విడుదల కావలసిన ‘అయ్యారీ’ ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. ‘పద్మావత్’ రావడంతో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 9కి వచ్చింది. అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మాన్’ కూడా అదే రోజుకి వాయిదా పడడంతో ఇంకోసారి ‘అయ్యారీ’ టీమ్ తమ సినిమా వాయిదా వేసుకుంది. వాయిదా పడిన ప్రతిసారీ పబ్లిసిటీ కార్యక్రమాలకు కాదనకుండా రకుల్ డేట్స్ ఇచ్చింది. ఇండియాలో మేజర్ సిటీలు, కాలేజీలు తిరిగింది. ఇప్పుడు సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఈ సినిమా ప్లాప్ అయినా రకుల్ చేతిలో ఇంకో హిందీ సినిమా వుంది. అయితే.. అది అజయ్ దేవగన్ సినిమా. ఇప్పటివరకూ అజయ్ దేవగన్ సరసన నటించిన ఏ సౌత్ హీరోయినూ హిందీలో స్టార్ కాలేదు. కాజల్ అగర్వాల్, తమన్నాలకు గతంలో అజయ్ ఛాన్సులు ఇచ్చాడు. సెంటిమెంట్ లెక్కన చూస్తే రకుల్ ఆశలు ఆవిరేనేమో. బ్యాడ్‌ల‌క్‌ అనుకోవాలేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.