జూన్‌ 3 నుంచి రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కందిరీగ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘నమో వెంకటేశ’, ‘దూకుడు’, ‘1 నేనొక్కడినే’, ‘లెజెండ్‌’, ‘పవర్‌'(కన్నడం), ‘ఆగడు’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలను నిర్మించిన 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.8గా రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ఓ భారీ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పుట్టినరోజు మే 15. ఈ సందర్భంగా రామ్‌కు నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్ర విశేషాలను తెలిపారు.
నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”జూన్‌ 3 నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తున్నాం. నాన్‌ స్టాప్‌గా షూటింగ్‌ చేసి దసరా కానుకగా సెప్టెంబర్‌ 30న గానీ, అక్టోబర్‌ 7న గానీ వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. కందిరీగ తర్వాత రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో ఇది మరో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతోంది. అలాగే మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది” అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, ఆర్ట్‌: అవినాష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close