ఎన్టీవీ చౌదరి టీవీ9 చౌదరి అయిన వేళ ..

నిన్నటి రంగస్థలం సంఖ్య సక్సెస్ మీట్లో చిన్న తమాషా జరిగింది. రామ్ చరణ్ మాట్లాడుతున్నప్పుడు జరిగిన చిన్న పొరపాటు వల్ల ఈ తమాష జరిగితే, అప్పటికప్పుడు రామ్ చరణ్ దానిపై సరదాగా స్పందించి, మరిన్ని నవ్వులు పూయించారు. వివరాల్లోకి వెళితే..

రంగస్థలం సక్సెస్ మీట్ ఫంక్షన్ కి ఎన్టీవీ నరేంద్ర చౌదరి కూడా అతిథిగా వచ్చారు ఈ వేడుకకు ఎన్టీవీ ఒక పార్ట్నర్ గా వ్యవహరించింది. రామ్ చరణ్ రంగస్థలం సక్సెస్ మీట్లో మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు. ఆ వరుసలో కృతజ్ఞతలు చెబుతూ, ఎన్టీవీ చౌదరి ని ” టీవీ9 చౌదరి” గా పొరపాటు గా సంభోదించారు. దీంతో నరేంద్ర చౌదరి తో సహా అందరు నవ్వడం మొదలుపెట్టారు. ఒక్క క్షణం అదేంటో అర్థం కాని రామ్ చరణ్, తర్వాత అర్థమై ” ఎన్టీవీ చౌదరి “అంటూ సరి చేసుకున్నారు. అయితే వెంటనే రామ్ చరణ్ -“టీవీలో రేపు ( తిప్పితిప్పి ) ఇదొక్కటే వేయరు కదా” అని సరదాగా వ్యాఖ్యానించడంతో అదేం లేదు అన్నట్టుగా ఎన్టీవీ నరేంద్ర చౌదరి చేయి వూపుతూ హాయిగా నవ్వేశారు . పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఆ నవ్వుతో జత కలపడం తో కాసేపు విజయోత్సవ సభలో నవ్వుల పువ్వులు పూశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.