రాజ‌మౌళిని మించిపోయిన రామ్‌చ‌ర‌ణ్‌

త‌న సినిమాని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలోనూ, ఫ్రీ ప‌బ్లిసిటీ తెచ్చుకోవ‌డంలోనూ రాజ‌మౌళిని మించిన వాళ్లు ఎవ‌రూ ఉండ‌రు. బాహుబ‌లి కానివ్వండి, ఆర్‌.ఆర్‌.ఆర్ కానివ్వండి.. పైసా ఖ‌ర్చు లేకుండా ప్ర‌మోట్ చేసుకోగ‌లిగాడు రాజ‌మౌళి. అందులోనూ అంత‌ర్జాతీయ స్థాయిలో. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్‌.ఆర్‌.ఆర్ గురించి మాట్లాడుకొంటున్నారంటే.. అదంతా రాజ‌మౌళి మార్కెటింగ్ స్ట్రాట‌జీనే. రాజ‌మౌళి ఏ సినిమా చేసినా, ఎవ‌రితో చేసినా.. రాజ‌మౌళికి త‌ప్ప ఇంకెవ్వ‌రికీ పేరు రాదు. అది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే.. బాహుబ‌లితో… ప్ర‌భాస్ అంత‌ర్జాతీయ స్టార్ అయిపోయాడు. అందుకోసం ప్ర‌భాస్ కూడా చేసిందేం లేదు. ఇప్ప‌ట్లో ఆర్‌.ఆర్.ఆర్ టీమ్ చేస్తున్న‌ట్టు.. బాహుబ‌లి టైమ్‌లో అంత‌ర్జాతీయంగా ఈ సినిమాకి ప్ర‌చారం చేసుకోలేదు. అదంతా అసంక‌ల్పితంగా వ‌చ్చిన ప‌బ్లిసిటీ మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భాస్ పేరు వినిపించింది.

ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్ విష‌యంలో రాజ‌మౌళి గురించి ఎంత మాట్లాడుకొంటున్నారో.. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల గురించి కూడా అంతే మాట్లాడుకొంటున్నారు. దానికి కార‌ణం.. `నాటు.. నాటు` పాట‌. ఈ పాట గ్లోబ‌ల్‌గా మంచి పాపుల‌ర్ అయిపోయింది. ఆ పాట‌లో క‌నిపించేది ఎన్టీఆర్‌,చ‌ర‌ణ్‌లే కాబట్టి.. ఈజీగా పాపులారిటీ వ‌చ్చేసింది. ఎప్పుడూ లేనిది… చ‌ర‌ణ్ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డం మొద‌లెట్టాడు. అమెరికాలో ప‌ర్య‌టిస్తూ, అక్క‌డ అవార్డు ఫంక్ష‌న్ల‌లో పాల్గొంటూ, గుడ్ మార్నింగ్ అమెరికా లాంటి కార్య‌క్ర‌మాల్లో ఇంట‌ర్వ్యూలు ఇస్తూ… ఆర్‌.ఆర్‌.ఆర్ తో సంపాదించుకొన్న ఇమేజ్‌ని రెట్టింపు చేసుకొంటున్నాడు. ఇది వ‌ర‌కు ఏ రాజ‌మౌళి హీరో చేయ‌ని… ప‌ని ఇది. ఈ విష‌యంలో అంద‌రికంటే.. ఎక్కువ మార్కులు తెచ్చుకొన్నాడు. అమెరికాలో చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా అపూర్వ‌మైన స్వాగ‌తం ల‌భిస్తోంది. హాలీవుడ్ స్టార్లు అత‌న్ని గుర్తు ప‌డుతున్నారు. మీడియా కూడా చ‌ర‌ణ్‌పై బాగా ఫోక‌స్ చేసింది. ఎన్టీఆర్ త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల అమెరికా వెళ్ల‌లేక‌పోయాడు. లేకుంటే ఇదే స్పంద‌న‌.. ఎన్టీఆర్‌కీ వ‌చ్చేది. ఆర్‌.ఆర్,ఆర్ క్రెడిట్ పూర్తిగా రాజ‌మౌళికి వెళ్ల‌కుండా… త‌న క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం రాబ‌ట్టుకోవ‌డంలో చ‌ర‌ణ్ స‌క్సెస్ అయ్యాడు. చ‌ర‌ణ్ త‌రువాతి సినిమాల‌కు ఈ ఇమేజ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. రేపు రాబోయే.. శంక‌ర్ సినిమాకి ఈ క్రేజ్ బోన‌స్ గా మారడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close