రామ్ చరణ్ న్యూ మూవీ టైటిల్….టూ ఫన్నీ

హిట్టు ఫార్ములా అనే వర్డ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్‌గా వినిపిస్తూ ఉంటుంది. ఆ మాటకొస్తే విన్నింగ్ టీంని ఛేంజ్ చేయడానికి స్పోర్ట్స్‌లో కూడా ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అదే సినిమాలకు వచ్చేసరికి హిట్ తీసుకొచ్చిన సీన్స్, టైటిల్స్, కథలను అంత ఈజీగా వదిలిపెట్టలేరు డైరెక్టర్స్. ‘చిరు’తగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా ఒక్క ఆరెంజ్ సినిమాలో మినహా మిగతా అన్ని సినిమాల్లోనూ చిరంజీవి పాటో, పేరో వినిపించేలా ప్లాన్ చేసుకున్నాడు. మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో మెగా స్టార్ గెస్ట్ అప్పియరెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో కొన్ని ఫ్లాప్స్ ఉన్నా సక్సెస్ పర్సంటేజే చాలా ఎక్కువ అన్నమాట వాస్తవం. అలాగే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ మేర్లపాక గాంధీకి కూడా ఎక్స్‌ప్రెస్ అనే వర్డ్‌ని టైటిల్‌లో యాడ్ చేయడం సెంటిమెంట్‌లా ఉంది. అందుకే కథకు సంబంధం లేకపోయినా రెండో సినిమాకు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అన్న టైటిల్‌ని ఫైనల్ చేశాడు. ‘రాజా’ అన్న వర్డ్ మాత్రం హీరో శర్వానంద్ సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. ఇఫ్పుడు రామ్ చరణ్, మేర్లపాక గాంధీ కలిసి చేయబోతున్న సినిమాకు కూడా ఎక్స్‌ప్రెస్ ఉండేలా ఏదైనా వెరైటీ టైటిల్ ప్లాన్ చేస్తున్నాడట గాంధీ. ఓ స్టార్ హీరో ఇమేజ్‌కి ఎక్స్‌ప్రెస్ అన్న వర్డ్ టైటిల్‌లో ఉంటే ప్లస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి కానీ ఆ రెండో వర్డ్ అయినా కొత్తగా ఉంటే బాగుంటుంది. కొన్ని రూమర్స్ వినిపిస్తున్నట్టుగా ‘మెగా ఎక్స్‌ప్రెస్’ లాంటి టైటిల్‌తో వస్తే మాత్రం సెటైర్సే ఎక్కువ పడే ఛాన్సులుంటాయోమో. ఆరెంజ్ తర్వాత మరోసారి లవ్ స్టోరీకి సై అన్న రామ్ చరణ్‌కి మేర్లపాక గాంధీ ఈ సారి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close