చ‌ర‌ణ్ మ‌రీ విసిగిస్తున్నాడ‌ట‌

ర‌చ్చ త‌ర‌వాత మ‌ళ్లీ మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేయాల‌ని తెగ ఉబ‌లాట‌ప‌డుతున్నాడు సంప‌త్ నంది. ఛోటా మేస్త్రీ స్ర్కిప్టు ప‌ట్టుకొని రెండేళ్ల నుంచి చ‌ర‌ణ్ వెంట ప‌డుతూనే ఉన్నాడు. చ‌ర‌ణ్ కూడా ఆ టైటిల్‌కి టెమ్ట్ అయిపోయాడు. లైన్ కూడా న‌చ్చింది. దాంతో సంప‌త్ నంది ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఊరేగుతున్నాడు. అయితే.. సినిమా చేస్తాడా, చేయ‌డా, చేస్తే ఎప్పుడు అనే విష‌యాల్లో చ‌ర‌ణ్ ఏమాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం త‌ని ఒరువ‌న్ సినిమా ప‌నుల్లో ఉన్నాడు చ‌రణ్‌. ఆ సినిమా త‌ర‌వాత కొర‌టాల శివ తో ఓ ప్రాజెక్టు ఒప్పుకొన్నాడు. క‌నీసం కొర‌టాల శివ త‌ర‌వాతైనా త‌న సినిమాని ఓకే చేయొచ్చుగా అన్న‌ది సంప‌త్ పాయింట్‌.

‘ఈ క‌థ నాకు వ‌ద్దు’ అని క్లియ‌ర్‌గా చెప్పేస్తే మ‌రో హీరోకి చెప్పి ఒప్పించుకొంటాను క‌దా, ఈ ఆల‌స్యం ఎందుకూ.. అని తెగ ఫీల‌వుతున్నాడ‌ట సంప‌త్ నంది. అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అంతే. గ‌బ్బ‌ర్ సింగ్ 2 ప్రాజెక్టు ఇస్తాన‌ని చెప్పి రెండేళ్లు తిప్పించుకొని చివ‌రికి హ్యాండిచ్చాడు. ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా తిప్పించుకొని ఐ యామ్ సారీ అంటూ చెబితే సంప‌త్ ప‌రిస్థితి ఏమిటో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close