చెర్రి ఐడియా అదిరింది..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు ఇప్పుడో అర్జెంట్ హిట్ కంపల్సరీ అయ్యింది. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ రెండు అంతగా అంచనాలు అందుకోలేకపోయే సరికి అభిమానులకు ఓ మంచి హిట్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యాడు చరణ్. ప్రస్తుతం తని ఒరువన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న చరణ్. ఆ సినిమా తర్వాత చేస్తున్న సినిమాల గురించి కూడా మంచి క్లారిటీతో ఉన్నాడు.

ముందుగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చెర్రి ఆ సినిమా ఆరెంజ్ లాంటి పక్కా లవ్ స్టోరీతో రాబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఆ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుందని టాక్. ఇక మారుతి కూడా రాం చరణ్ కోసం ఓ అద్భుతమైన కథ రెడీ చేశాడట. చరణ్ అవకాశమిస్తే స్టార్ హీరోల సినిమాలను కూడా హిట్ చేసి చూపిస్తా అంటున్నాడు మారుతి. చూస్తుంటే చెర్రి మెగా ఐడియా వేసినట్టే అనిపిస్తుంది. సో ఈ లెక్కన రాబోయే ఈ సినిమాతో చరణ్ ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close