రామ్ చరణ్ తేజ్…ఊహించలేనంత స్థాయిలో మారాడా?

చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మగధీరతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. రెండు సినిమాలతోనే నంబర్ ఒన్ హీరో రేసులోకి రామ్ చరణ్‌ని తీసుకొచ్చేసింది మీడియా. ఆ తర్వాత ఆరెంజ్ సినిమా రిజల్ట్ విషయం పక్కన పెడితే రచ్చ నుంచి వరుస హిట్స్‌తో దూసుకెళ్ళాడు. రెగ్యులర్ మాస్ మసాల సినిమాలతోనే కలెక్షన్స్ కొల్లగొట్టాడు. పెద్దగా విషయంలేని కథలు, డైరెక్షన్‌లో ఏ స్పెషాలిటీ లేకపోయినప్పటికీ సినిమాలు మాత్రం సూపర్ హిట్స్ అయ్యాయి. దాంతో రామ్ చరణ్ స్టామినా గురించి చాలా మంది చాలా ఎక్కువ చెప్పేశారు. ఆ టైంలోనే విమర్శలను వెంట్రుక ముక్క కింద తీసిపడేశాడు చరణ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ ఇష్యూతో పాటు ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అన్నీ కలిసి రామ్ చరణ్ బిహేవియర్ గురించి ప్రేక్షకులకు కూడా నెగిటివ్ అభిప్రాయం కలిగేలా చేశాయి.

కానీ అదంతా గతం. ఇప్పుడు రామ్ చరణ్‌లో ఎవ్వరూ ఊహించలేనంత మార్పు కనిపిస్తోంది. స్టార్ హోటల్‌లో జరిగిన చిరంజీవి బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్‌లో మీడియాను సరిగా ట్రీట్ చేయలేదు. జర్నలిస్టులందరూ కూడా అవమానంగా ఫీలయ్యారు. ఆ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ జర్నలిస్టులకు సారీ చెప్పాడు. అలాగే చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌కి బ్రహ్మాండమైన కవరేజ్ ఇచ్చిన మీడియాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. విమర్శలను వెంట్రుకతో సమానంగా తీసిపడేసిన రామ్ చరణ్‌కి ఇప్పుడు ఆ విమర్శల ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో బాగానే తెలిసొచ్చినట్టుంది. రామ్ చరణ్‌లో వచ్చిన మార్పు మాత్రం చరణ్ కెరీర్‌కి చాలా హెల్ప్ అవుతుందనడంలో సందేహం లేదు. విమర్శలు వచ్చినప్పుడు ఎంత హుందాగా సమాధానం చెప్పొచ్చు, అనవసరమైన ఇష్యూస్‌లో తల దూర్చకుండా కెరీర్‌లో టాప్ పొజిషన్‌కి ఎలా వెళ్ళాలి లాంటి వాటికి గైడ్ లాంటి చిరంజీవి కెరీర్‌, ఆలోచనలను స్టడీ చేస్తే రామ్ చరణ్ ఇంకా చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close