మ‌ణిర‌త్నంని మ‌ర్చిపోయిన చ‌ర‌ణ్‌

మ‌ణిర‌త్నంతో సినిమా అన‌గానే ఎగిరి గంతేస్తార‌ని అనుకొంటారంతా. కానీ.. ఎవ‌రి లెక్క‌లు వాళ్ల‌కు ఉంటాయి. ఎప్పుడు ఏ ద‌ర్శ‌కుడితో చేయాలో, ఎప్పుడు ఎలాంటి క‌థ‌ల్ని ఎంచుకోవాలో స్టార్ హీరోల‌కు బాగా తెలుసు. ‘సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా ఫ‌ర్లేదు.. మ‌ణిర‌త్నంలాంటి ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తే అదే ప‌ది వేలు’ అనుకొనేవాళ్లు ఈ రోజుల్లో మాత్రం అరుదే. అందుకే మ‌ణిర‌త్నంకి హీరోలు క్ర‌మంగా దూర‌మైపోతున్నారు. తాజాగా చెలియా సినిమా మ‌రింత ఎఫెక్ట్ చూపించింది. చెలియా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఎవ‌రికి వాళ్లు జాగ్ర‌త్త‌ప‌డిపోతున్నారు. రామ్ చ‌ర‌ణ్ కూడా.. ఇప్పుడు మ‌ణిర‌త్నం సినిమా విష‌యంలో సైలెంట్‌గా ఉన్న‌ట్టు భోగ‌ట్టా.

సుకుమార్ సినిమా త‌ర‌వాత మ‌ణిర‌త్నం సినిమానే మొద‌ల‌వుతుంది అనుకొన్నారు. మ‌ణిర‌త్నం ఇప్ప‌టికే చ‌ర‌ణ్ కి ఓ లైన్ వినిపించాడు. అయితే చెలియా రిజ‌ల్ట్ త‌ర‌వాత‌.. చిరు జాగ్ర‌త్త‌ప‌డిపోయిన‌ట్టు స‌మాచారం. చ‌ర‌ణ్ కూడా మ‌ణిర‌త్నం సినిమా విష‌యంలో భ‌య‌ప‌డుతున్నాడ‌ట‌. ”సుకుమార్‌తో సినిమా ఓ ప్ర‌యోగం.. మ‌ణిర‌త్నం సినిమా కూడా దాదాపుగా అలాంటిదే. వ‌రుస‌గా రెండు ప్ర‌యోగాలు చేయ‌డం ఏ హీరోకైనా క‌ష్ట‌మే. అందుకే మ‌ణిర‌త్నం సినిమా నుంచి చ‌ర‌ణ్ డ్రాప్ అయ్యే ఛాన్సులున్నాయి” అంటూ మెగా కాంపౌండ్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సుకుమార్ సినిమా త‌ర‌వాత ఎవ‌రితో ప‌నిచేయాలో చ‌ర‌ణ్ ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌న్న‌ది మెగా పీఆర్వోల మాట‌. అంటే. మ‌ణి ర‌త్నాన్ని ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయ‌మైపోయింద‌న్న‌మాట‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com