‘నేల టికెట్టు’ న‌ష్టాలు పూడ్చ‌డానికి..

‘నేల టికెట్టు’ విడుద‌ల‌కు ముంద – ‘ర‌వితేజ‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ సినిమా చేస్తా’ అని ప్ర‌క‌టించారు ‘నేల టికెట్టు’ నిర్మాత రామ్ తాలూరి. ‘ర‌వితేజ అంటే ఇష్ట‌మేమో’ అనుకున్నారంతా. ఆయ‌న అన్న‌ట్టుగానే ర‌వితేజ‌తో మ‌రో సినిమా చేయ‌డానికి రామ్ తాలూరి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే… ఇదేం ర‌వితేజ‌తో ఇష్టంతోనో, ప్రేమ‌తోనో కాదు. ‘నేల టికెట్టు’ న‌ష్టాల్ని భ‌ర్తీ చేయ‌డానికి. ర‌వితేజ – క‌ల్యాణ్ కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘నేల టికెట్టు’ దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. వీకెండ్స్‌లో కూడా వ‌సూళ్లు అంతంత మాత్రంగానే అందాయి. ఈ సినిమాతో నిర్మాత పీక‌ల్లోతు న‌ష్టాల్లో కూరుకుపోయాడు. న‌ష్ట ప‌రిహార చ‌ర్య‌ల్లో భాగంగా ర‌వితేజ‌తోనే మ‌రో సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. అక్టోబ‌రు – న‌వంబ‌రులో ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంది. దీనికి క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడా, లేదంటే మ‌రో ద‌ర్శ‌కుడు రంగంలోకి దిగుతాడా? అనేది తెలియాల్సివుంది. ‘నేల టికెట్టు’ సెట్స్‌పై ఉండ‌గానే క‌ల్యాణ్ కృష్ణ‌తో మ‌రో సినిమా చేయ‌డానికి ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారు రామ్ తాలూరి. ఆ ర‌కంగా… ఆయ‌న చేతిలో ద‌ర్శ‌కుడు ఉన్న‌ట్టే. కానీ.. క‌ల్యాణ్‌కి ర‌వితేజ మ‌రో అవ‌కాశం ఇస్తాడా, లేదా? అనేదే అనుమానంగా మారింది. ఓ సినిమా ఫ్లాప్ అయితే.. ఆ వెంట‌నే న‌ష్ట‌ప‌రిహారంగా మ‌రో సినిమా మొద‌లెట్ట‌డం టాలీవుడ్‌లో త‌ర‌చూ జ‌రిగేదే. కాక‌పోతే.. న‌ష్టాలు పూడ్చ‌డానికి తీసిన సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాడు. ‘ఆంధ్రావాలా’ త‌ర‌వాత వ‌చ్చిన ‘నా అల్లుడు’ అందుకు అతి పెద్ద నిద‌ర్శ‌నం. మ‌రి ఈ సినిమా ఏమ‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close