ఆదినారాయణరెడ్డి చేరికను అంగీకరించేది లేదన్న రామసుబ్బారెడ్డి

హైదరాబాద్: జమ్మలమడుగు ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టీడీపీకి చెందిన జమ్మలమడుగు నాయకుడు రామసుబ్బారెడ్డి చెప్పారు. ఇవాళ విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ళ కాంగ్రెస్ రాక్షసపాలనలో తాము, టీడీపీ కార్యకర్తలు నరకాన్ని అనుభవించారని చెప్పారు. తమ కార్యకర్తలు కూడా ఆదినారాయణరెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు అంటే తమకు ఎంతో గౌరవమని చెప్పారు. ఆదినారాయణరెడ్డి చేరితే పార్టీ బలోపేతమవుతుందని అంటున్నారని తెలిపారు. కార్యకర్తలు ఎడ్జెస్ట్ అవటం కష్టమని, పార్టీలోకి వస్తే ఇబ్బందులు పడతామని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కుటుంబసభ్యులను కోల్పోయామని గుర్తు చేశారు. ఇన్ని సంవత్సరాలు పార్టీకోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఇప్పుడైనా ఇబ్బందిలేకుండా చూడాలని కోరుతున్నామని రామసుబ్బారెడ్డి చెప్పారు. మరి చంద్రబాబు రామసుబ్బారెడ్డిని ఎలా ఒప్పిస్తారో చూడాల్సిఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]