వేల కోట్ల వ్యాపారం మొద‌లెట్ట‌నున్న రామోజీ

ప‌త్రికా రంగంలో రారాజు ఈనాడు. అధినేత రామోజీ రావుని మీడియా మొఘ‌ల్ అంటారంటే, ప్రింట్ మీడియాలో ఈనాడు పెత్త‌నం, రామోజీ తెలివితేట‌లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవొచ్చు. రామోజీ ఏ ప‌ని మొద‌లెట్టినా అది గ్రాండ్ స‌క్సెసే. ఫిల్మ్ సిటీ సూప‌ర్ హిట్‌. ప్రియా ప‌చ్చ‌డి హిట్‌. మార్గ‌ద‌ర్శి బంప‌ర్ హిట్‌. ఉషాకిర‌ణ్ మూవీస్ హిట్టు మీద హిట్టు. ఇంగ్లీష్ డైలీ విష‌యంలోనే రామోజీ త‌ప్ప‌ట‌డుగు వేశాడు. ఆ త‌ర‌వాత ఏ వ్యాపారం మొద‌లెట్టినా మ‌రింత ఆచి తూచి వ్య‌వ‌హ‌రించడం మొద‌లెట్టారు. ఇప్పుడు రామోజీ మ‌రో కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని టాక్‌. ఈసారి హోమ్ థియేట‌ర్ పై రామోజీ దృష్టిసారించార్ట‌.

హోం థియేట‌ర్ అంటే మ‌న టీవీకి పెట్టుకునే సౌండ్ సిస్ట‌మ్ త‌ర‌హా కాదు. సెల‌బ్రెటీల ఇళ్ల‌లో ఓ మినీ థియేట‌రే ఉంటుంది క‌దా.. ఆ త‌ర‌హా అన్న‌మాట‌. విదేశాల్లో హోం థియేట‌ర్స్‌కి బాగా అల‌వాటు ప‌డుతున్నారు జ‌నం. ఇక్క‌డ కూడా ఆ సంస్ర్కృతి పెరుగుతోంది. ఒక్కో థియేట‌ర్ రూప‌క‌ల్ప‌న‌కూ రూ.10 నుంచి 25 ల‌క్ష‌ల వ‌ర‌కూ అవుతుంద‌ని తెలుస్తోంది. అధునాత‌న సౌండ్ టెక్నాల‌జీ, శాటిలైట్ తో అనుసంధానం.. లాంటి విష‌యాల్లో మేటిగా అనిపించుకున్న ఓ కంపెనీతో రామోజీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నార‌ని, త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన విష‌యాలు బ‌య‌ట‌కు రాబోతున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఈ కొత్త వ్యాపారంలో రామోజీ ఎన్ని అద్భుతాలు సృస్టిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close