ఆ రెండు సినిమాల్నీ ప‌క్క‌న పెట్టేసిన‌ట్టేనా?

నేనే రాజు – నేనే మంత్రి తో తేజ ఫామ్ లోకి వ‌చ్చాడు. అయితే `సీత‌`తో ఓ డిజాస్ట‌ర్ త‌గిలింది. కాక‌పోతే… త‌న‌కొచ్చిన అవ‌కాశాల‌కు కొద‌వ లేదు. ఒకేసారి రెండు ప్రాజెక్టుల్ని ఒప్పుకున్నాడు. ఒకటి గోపీచంద్‌తో. మ‌రోటి రానాతో. రెండింటికీ వైవిధ్య‌భ‌రిత‌మైన పేర్లు పెట్టి – ఆకట్టుకున్నాడు.

అయితే ఇప్పుడు తేజ ముందు మ‌రో మంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అమేజాన్ తో లింక్ అప్ అయి వెబ్ సిరీస్‌ల‌ను తీసే అవ‌కాశం వ‌చ్చింది. అమేజాన్ అంటే పెద్ద ప్రాజెక్టే. ఎందుకంటే.. సినిమాల‌కు మించిన బ‌డ్జెట్ ఇవ్వ‌డానికి వాళ్లు రెడీ. లాక్ డౌన్ ఎత్తేసిన వెంట‌నే ఈ వెబ్ సిరీస్‌ల‌ను మొద‌లెట్టే అవ‌కాశం ఉంది. దాంతో.. తాను ముందు ఒప్పుకున్న రెండు ప్రాజెక్టులూ తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టే అవ‌కాశం ఉంది. అయితే అదేం పెద్ద స‌మ‌స్య కాదు. గోపీచంద్ ప్ర‌స్తుతం `సిటీమార్‌`తో బిజీగా ఉన్నాడు. రానా `విరాట‌ప‌ర్వం`తో బిజీ. లాక్‌డౌన్ ఎత్తేశాక‌, షూటింగులు మొద‌లైతే – ముందు ఆ సినిమాల్ని పూర్తి చేసుకోవాలి. ఆ త‌ర‌వాతే తేజ‌కు కాల్షీట్లు ఇస్తారు. ఈలోగా ఆమేజాన్‌కి సంబంధించి ఓ వెబ్ సిరీస్‌ను తేజ పూర్తి చేసే అవ‌కాశం ఉంది. తేజ వ‌ర్క్‌లో చాలా ఫాస్టు. త‌క్కువ స‌మ‌యంలోనే పూర్తి చేసేస్తుంటాడు. వెబ్ సిరీస్‌కి కావ‌ల్సింది అదే. త‌క్కువ లొకేష‌న్లు, ప‌రిమిత‌మైన కాస్టింగ్ తో ఈ వెబ్ సిరీస్‌ని తేజ పూర్తి చేసే అవ‌కాశం ఉంది. ఆ త‌ర‌వాత గోపీచంద్‌, రానాల‌లో ఎవ‌రు ముందు ఫ్రీ అయితే.. వాళ్ల‌తో ప్రాజెక్టుని ప‌ట్టాలెక్కిస్తాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close