డబుల్‌రోల్‌లో మెప్పించిన రానా

హైదరాబాద్: రానా డబుల్‌రోల్‌లో నటించిన ఒక ఎడ్వర్టయిజ్‌మెంట్ ఇటీవల ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమవుతూ అందరినీ మెప్పిస్తోంది. మైక్రోమాక్స్ మొబైల్స్‌వారికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన రానా, వారి కొత్త స్మార్ట్ ఫోన్ బోల్ట్ యాడ్‌లో దర్శనమిచ్చాడు. ఈ యాడ్ ఇలా సాగుతుంది. రాత్రి సమయంలో ఒక రానా ఇంట్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతుంటాడు. రెండో రానా దొంగలాగా చారల టీషర్ట్, తలకు ముసుగు, ఒక బ్యాగ్ తీసుకుని మొదటి రానా దగ్గరకు వస్తాడు. మొదటి రానా, ఏయ్ ఫ్యాన్సీ డ్రస్, ఎక్కడికిరా బయలుదేరావ్ అని అడుగుతాడు. బ్యాంక్ దోచుకోవటానికి వెళుతున్నానని, చేతిలో డబ్బుంటే స్నేహితులు కూడాకూడా వస్తారని రెండో రానా చెబుతాడు. స్నేహితులు కాదు పోలీసులు వస్తారని, స్నేహితులు కావాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలని, బిందాస్‌గా వాట్సప్ చేయమంటూ మైక్రోమాక్య్ బోల్ట్ ఫోన్‌ను ఇస్తాడు. రెండో రానా అది తీసుకుని, బ్యాగ్ కిందపడేసి వాట్సప్ చేస్తుండగా యాడ్ ముగుస్తుంది.

యాడ్‌ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. రానా చాలా క్యాజువల్‌గా నటించటం విశేషం. రానాకు మామూలుగా కెమేరా కాన్షస్‌నెస్ ఉంటుంది. ఈ యాడ్‌లో అదేమీ లేకుండా చాలా క్యాజువల్‌గా కనిపించాడు. రెండు పాత్రలలోనూ మెప్పించాడని చెప్పాలి. లీడర్‌తో రంగప్రవేశం చేసిన రానా రెండు మూడు సినిమాలలో హీరోగా చేసినప్పటికీ అవి విజయం సాధించకపోవటం, బాహుబలి, రుద్రమదేవి చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్‌లో కనిపిస్తుండటంతో అలాగే సెటిలయిపోతాడా అని ఇటీవల డౌట్‌లు వ్యక్తమవుతున్నాయి. అయితే త్వరలో రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలో హీరోగా నటించబోతున్నాడని తెలిసింది. విజయదశమిరోజున ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటించబోతోందని, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.

[youtube http://www.youtube.com/watch?v=UgySAhFv5jI&w=640&h=360]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close