మ‌రోసారి ‘నేనే రాజు…’ ఫార్ములా

గ్రే షేడ్స్ ఉన్న హీరో పాత్ర‌ల్ని మ‌న‌వాళ్లు అరుదుగా ట‌చ్ చేస్తుంటారు. ‘ల‌వ‌కుశ‌’, ‘టెంప‌ర్‌’ల‌లో ఎన్టీఆర్ ఈ త‌ర‌హా పాత్ర‌ల్ని ఎంచుకుని విజ‌యం సాధించాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానా పోషించిన పాత్ర‌లోనూ గ్రే షేడ్స్ ఉంటాయి. ఓ ర‌కంగా ఆ సినిమాకి త‌నే హీరో, త‌నే విల‌న్‌. ఇప్పుడు మ‌రోసారి ఆ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు రానా.

రానా – తేజ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా ప‌ట్టాలెక్కుతోంది. దీనికి ‘రాక్ష‌స రాజు రావ‌ణాసురుడు’ అనే పేరు ఖాయం చేశారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమాలో రానా పాత్ర గ్రే షేడ్స్‌లో ఉండ‌బోతోంది. త‌న ఎదుగుద‌ల కోసం ఏమైనా చేయ‌డానికి సిద్ధ‌ప‌డే పాత్ర అది. స్వార్థానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఆ పాత్ర‌ని డిజైన్ చేశాడ‌ట తేజ‌. `నేనే రాజు – నేనే మంత్రి`లో హీరో పాత్ర చిత్ర‌ణ కూడా ఇలానే ఉంటుంది. మ‌రోసారి అదే ఫార్ములాలో వెళ్ల‌బోతున్నాడ‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే క‌థానాయిక పేరు అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close