రంగస్థలం 1985 : కథా విశ్లేషణ

Written By  : Balaji 

Backdrop

“1985” పల్లెల్లో భూస్వామ్య వ్యవస్థనుండి ప్రజాస్వామ్య వ్యవస్థ గా రాజకీయాలు మారుతున్న టైం అది. అలాంటి టైం లో ‘రంగస్థలం’ అనే ఊరిలో ఉండే తక్కువ కులం వాడైన ‘చిట్టిబాబు’ కథే ఈ సినిమా.

Protagonist

నల్లత్రాచుకి ఒక లక్షణం ఉందంటారు. ఎవరి మీదైనా పగబడితే ఆనవాళ్ళని, అడుగు జాడలని బట్టి వెతికి వెతికి పగ తీర్చుకుంటుందట, పగ తీరేవరకు నిద్రాహారాలు కూడా మానేస్తుందట. అలాంటి నల్లత్రాచు మీదనే పగ బట్టే రకం చిట్టిబాబు (రామ్ చరణ్). పాములకుమల్లే ప్రకంపనాలతో తప్పపూర్తి స్థాయిలో వినలేడు కూడా…  రంగస్థలంలో పొలాలకు నీరందకపోతే ఇంజన్ వేసి డబ్బులు తీసుకోవడం చిట్టిబాబు పని. చెవుడని బైటకు తెలీకుండా మేనేజ్ చేస్తూ ఊర్లో అందరితో సరదాగా తిరుగుతుంటాడు.

తండ్రి(నరేష్) ఊళ్ళో దర్జీ, అన్న కుమార్ బాబు(ఆది) చదువుకొని దుబాయ్ లో జాబ్ చేసి వస్తాడు.

అదే ఊళ్ళో తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఉండే రామలక్ష్మిని చూసిన క్షణమే ఇష్టపడతాడు చిట్టిబాబు. తర్వాతి క్రమంలోరామలక్ష్మి (సమంతా) కూడా చిట్టిబాబుని ఇష్టపడుతుంది.

Antagonist

దాదాపు 30 సంవత్సరాలుగానియంత్రత్వ పరిపాలన చేస్తూ ప్రెసిడెంట్ పదవిలో చలామణి అవుతుంటాడు. మరొకరికి అవకాశం ఇవ్వడు. గ్రామంలో ప్రజలంతా అతను చెప్పిందే వినాలి. ఎదురుతిరగాలన్నా, కనీసం పేరుతో పిలవాలన్నా భయపడతారు రంగస్ధల జనం. తన ఇంటి ముందు ఎవరన్నా వెళ్లాలంటే చెప్పులు తీసి వెళ్లాల్సిందే. వర్గ కట్టుబాట్లకు కూడా కట్టుబడిఉంటాడు.

(కథలో మొదటి మలుపు)
ఇలా ఉండగా రంగస్థలంలో సొసైటీ పేరుతో జరిగే మోసాల బాధిత రైతుల్లో, రామలక్ష్మి నాన్న కూడా ఉండడంతో సొసైటీ మోసాలు కుమార్ బాబుకి తెలుస్తాయి….
సొసైటీ వెనుక ఉంది రంగస్థలంప్రెసిడెంట్ ‘ఫణీంద్ర భూపతి ‘ (జగపతిబాబు).

(హీరో క్రైసిస్)
అలాంటి ప్రెసిడెంట్ సహాయకులనే నిలదీసే క్రమంలో చిట్టిబాబు నాన్నకి అవమానం జరుగుతుంది… దీంతో ఊరి సమస్య కాస్తా ‘ఫామిలీ’ సమస్యగా తిరుగుతుంది. దాంతో ఆవేశ పరుడైన చిట్టిబాబు ప్రెసిడెంట్ మనుషుల్ని కొట్టడం, దానికి ప్రతిగా చిట్టిబాబుని జైలులో పెట్టించడం జరుగుతుంది.
(విలన్ క్రైసిస్)
దీంతో కుమార్ బాబు భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థని రంగస్థలంలోకి తీసుకురావాలని ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తాడు. దాని కోసం ఆ ప్రాంత నియోజకవర్గ యమ్. ఎల్. ఏ దక్షణామూర్తి కి సంబందించిన పార్టీలోజాయిన్ అవుతాడు…
దాంతో రంగస్థలంలో రాజకీయాలు లేవనెత్తుతాయి….

Protagonist crisis down to up

కుమార్ బాబు ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా నిలబడ్డాడు అనే ఆనందంలో ఉన్న చిట్టిబాబుకి… ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా నిలబడ్డవాళ్ళు ఎంత మంది చనిపోయారో, ప్రెసిడెంట్ వాళ్ళని ఎలాచంపాడో చిట్టిబాబుకి అత్త వరుసయ్యె రంగమ్మత్త (అనసూయ) ద్వారా తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళ లో రంగమ్మత్త భర్త (రాజీవ్ కనకాల) కూడా ఉన్నాడని తెలిస్తుంది. అన్న కోసం ప్రేమని కూడా వదులుకోగలిగేంత ఇష్టం చిట్టిబాబుకి అన్న కుమార్ బాబు అంటే. అలాంటి అన్నని ప్రెసిడెంట్ ఎక్కడచంపేస్తాడో అని భయంపట్టుకుంటుంది…

దాంతో కుమార్ బాబు ఎక్కడికెళ్లినా చిట్టిబాబు మాటేసి ఉంటాడు. కుమార్ బాబు ప్రేమిస్తున్న అమ్మాయికోసం రెగ్యులర్ గా పట్నం వెళ్తుంటాడు కాబట్టి అక్కడ కూడా కాపు కాస్తాడు.

ఎంత జాగ్రత్తపడ్డా… రక్షణ ఇచ్చేవాడి జాగ్రత్త కన్నా, ప్రమాదం చేయాలనుకునే వాడి ప్రణాళిక స్పష్టంగా ఉంటుంది కాబట్టి….

ఊరికి సంబంధం లేని కొందరు కిరాయిరౌడీలు చెరుకు కొట్టడానికి వచ్చినట్టు వచ్చి పట్నంలో ప్రేమించిన అమ్మాయిని కలిసి కుమార్ బాబు పైన కత్తులతో అటాక్ చేస్తారు. చిట్టిబాబువాళ్ళందర్నీ చంపేసి అన్నని కాపాడుకుంటాడు …
(ప్రమాదం)
రంగస్థల నాటకంలో ఎవడి ఆట ఎవడి ఆటతో ముగించబడుతుందో ముందే గ్రహించలేం కాబట్టి కుమార్ బాబు అనే పాత్ర గుర్తుతెలీని ఇంకొక పాత్ర చేతిలో హతమౌతుంది….

(రివేంజ్)

పాముపైనే పగబట్టే చిట్టిబాబు సొంత అన్నని చంపిన వాడిపైన ఇంకెంతపగబడతాడు …

ఊరి జనంతో కలిసి ప్రెసిడెంట్ ని చంపాలని వెళ్తే ప్రెసిడెంట్ పారిపోయాడని తెలిసి కోపాన్నిఅణుచుకుంటాడు.

చుట్టుపక్కల ఊర్లన్నీ గాలించినా ప్రెసిడెంట్ దొరక్కపోయేసరికి చివరికి ఆనవాళ్ల కోసం సోది, గవ్వలువేయించటం లాంటిమూఢనమ్మకాలని కూడా నమ్మి …. నిద్రాహారాలు లేకుండా గాలిస్తాడు …

చివరికి చిట్టిబాబుని కాటేసిపారిపోయిన పాము కోసం రోజూగాలించే చోటే, పాముపుట్టలో తలదాచుకున్నట్టు .. తాను ఏర్పాటుచేయించుకున్న పాముపుట్ట లాంటిపాకలో ప్రెసిడెంట్ తలదాచుకోవడాన్నిపసిగడతాడు చిట్టిబాబు.

పుట్టలో నుండి పాముని బైటకి తీసి చేకర్ర తో రైతులు ఎలా అయితేచంపుతారో …

చిట్టిబాబు చేతిలో ఉన్న చారల ఎదురు కర్రతో పాముని చంపినట్టుకొట్టి కొట్టి ప్రెసిడెంట్ ని చంపుతాడు…

(థర్డ్ ట్విస్ట్)

ఆ తర్వాత చిట్టిబాబుకి తెలుస్తుంది … తన అన్నని చంపింది పాము లాంటిప్రెసిడెంట్ పాత్ర కాదని తోడేలులాంటి పాత్ర ఇంకోటుందని …ఆ పాత్రే దక్షణమూర్తి
తన కూతుర్ని ప్రేమించిన కుమార్ బాబు తక్కువకులం వాడు కావడంతో చంపించేస్తాడు….

(ముగింపు)

తోడేలు లాంటి దక్షణ మూర్తిని పైరు కోసే కొడవలితో పీక కోసి చంపేస్తాడు
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడుదగన్
హేమంబు గూడబెట్టిన
భూమిశుల పాలజేరు భువిలో సుమతీ!

కానీ తోడేళ్ళు పాముల్లా కాదు …నమ్మించి మింగేస్తాయ్….

అప్పటి నుండి ఇప్పటి వరకు వర్గానికి ప్రాధాన్యతనిచ్చె తోడేళ్ళే రాజకీయంలో కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని పాములు పల్లెల్లో భూస్వామ్య వ్యవస్థని కొనసాగిస్తున్నాయ్…

విశ్లేషణ:

అనుకున్న కథని Nonlinear narrative కథనంతో క్లియర్ గాచెప్పటం బాగుంది.
ఇలాంటి భూస్వామ్య వ్యవస్థ పైన ప్రాణం ఖరీదు, మనఊరిపాండవులు లాంటి సినిమాలు ఎన్నో వచ్చినా వాటిల్లో తిరుబాటునే చూపించడం జరిగింది, మార్పు చూపించలేదు. రంగస్థలంలో అది టచ్ చేసి ప్రస్తుత పరిస్థితులకు అప్పటికి పెద్ద తేడా లేదని గుర్తుచేసినట్టు అనిపించింది.

ఎర్రమందారం లోని ఎమోషనల్ పాయింట్స్ కొన్ని టచ్ అయినట్టు అనిపించినా సుకుమార్ నారేషన్ తో మెస్మరైజ్ చేసాడు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసిన కథలను తీసేప్పుడు కొంచెం అటు ఇటు అయినా ‘మళ్ళీపాతసినిమానే కదరా’ అనుకునే అవకాశం ఉంది.

నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కథలోని పాత్రలను ఆ విధానాలను అర్దంచేసుకొని ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

నటీ నటులు:

చరణ్:

పాముని వెతికే దగ్గరనుండిదక్షిణామూర్తిని చంపే వరకు ఒకటేఎమోషన్ క్యారీ చేశాడు …! సమంత, అనసూయతో ఉన్న కొన్ని సీన్స్ లోఆరాధనలో చిరంజీవి గుర్తొచ్చాడు…!!
లుంగీ ఎగ్గట్టే విధానం, బీడీ తాగడం, అన్నం తినే విధానం, పళ్ళపొడితో పళ్ళు తోముకునే విధానం, మందు తాగే విధానం ఇలాంటివి చూసినప్పుడు మెగాస్టార్ కొడుకు ఏమూలనా కనిపించలేదు. ఒక పల్లెటూరి బైతు చిట్టిబాబే కనిపించాడు. పగతో రగిలిపోయే సీన్ , ఆది చనిపోయాక ఎమోషనల్  ఫీల్ అవ్వటం గాని చాలా నాచ్యురల్ గా చేసి నటుడిగా వందమార్కులు కొట్టేసాడు

సమంత:
సమంత కూడా ఆశ్చర్యమే నాకు. తాను పుట్టిపెరిగిన వాతావరణానికిపక్కా పల్లెటూరి తింగరిలా ఎలాచేసిందా అని.
చిట్టిబాబుని కలవాడికి వచ్చినప్పుడుసిట్యుయేషన్స్ ఏ చాలా నచ్యురల్అనిపించింది. పల్లెటూర్లో వయసుకువచ్చెంత వరకు కొంత అమ్మాయిలుబైట ఎవరికీ తెలీదు తల్లితండ్రులుచెప్పిన పని చేస్తూ (పొలంపనులు, ఇంట్లో పనులు) తెలిసినఇద్దరుముగ్గురు ఫ్రెండ్స్ తోఆటలాడుకోవడం తప్ప ఊర్లో వాళ్ళగురించి పెద్దగా తెలీదు ఎప్పుడైతేవయసుకు వస్తారో తల్లితండ్రులు చేసేపనుల్లో లోపాలు, బైటవాళ్ళతోలావాదేవీలు అర్ధమౌతాయి. అలానేమొదలవుతుంది చిట్టిబాబుతో కూడాపరిచయం. ఆ తర్వాత పొలం పనులదగ్గర, తిరునాళ్లలో, సొసైటీ దగ్గర ఇలాకనిపిస్తూనే ఉండటం సాధారణమేఅవుతుంది.
మంగమ్మ సాంగ్ లో ఎక్స్ప్రెషన్స్ గాని, చరణ్ కి వినపడదని తెలిసినప్పుడు ప్రపోస్ చేసే విధానం గాని, క్లైమాక్స్ లోప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి చరణ్ పక్కన ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ గాని మైండ్బ్లోయింగ్. నేను చిన్నప్పటి నుండిచూస్తున్న మా ఊర్లో పిల్లలే గుర్తొచ్చారు!

జగపతిబాబు: ప్రెసిడెంట్ అనే పిలవాలి. ఇలాంటిపాత్రలో ప్రాణంఖరీదు సినిమాలో రావు గోపాల్ రా వు గారి నటన నాకు అల్ టైం ఫేవరైట్…! బట్ ఆ పోలికలు లేకుండా ఆయనస్థాయిని అక్కడే ఉంచి సపరేట్ స్థాయిలో క్యారెక్టర్ ప్రెసెంట్ చేసారు. ఎంట్రీ ఏ ట్రాక్టర్ మీద రావడం, వెనుక కెమెరా పెట్టినప్పుడు జంధ్యం తప్ప షర్ట్ లేకపోవడం, అంత్యక్రియలకు మొలలో నుండి డబ్బులు తీసి ఇవ్వడం. తను తాగే టీ, మజ్జిగ కోసం తానే బర్రె నుండి పాలు పిండుకోవడం … చుట్టాకు తో చుట్ట చుట్టుకోవడం చాలా బాగా అనిపించింది …
తన దగ్గర పని చేసే పనివాడికొడుకుని ప్రెసిడెంట్ ఏ చంపాడని పని వాడికి తెలిసే సీన్ లో జగపతిబాబు ఎక్స్ప్రెషన్స్ డైరెక్ట్ గా పెట్టలేదు. చాలా సేపు వెనుకనే ఉంటుంది కానీ ఫ్రస్ట్రేషన్ బాడీ కదిలిపోతుండడంలోతెలిసిపోతుంది.
ఆది:

కుమార్ బాబు క్యారెక్టర్ అలా క్యారీ అయిపోయింది…. ఎక్కడా తన ముందు సినిమాల ఆనవాళ్లు కనిపించిన దాఖలాలు లేవు.
అనసూయ:
రంగమ్మత్తని చూస్తే స్వాతిముత్యంలో దీప క్యారెక్టర్ గుర్తొచ్చింది. మా ఆయనదుబాయ్ వెళ్ళాడు అని గారాలు పోతూ, మంచిచెడు తెలిసిన అమాయక పెద్ద తరహా పాత్ర. నిజానికి ఫస్ట్ షాట్ కి నా ఫీలింగ్ సెక్స్యువల్ గా మొదలైనా క్రమేపి గౌరవప్రదమైన ఫీలింగ్ తో ఎండ్ ఐంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర చాలా కీలకమైంది. చిట్టిబాబుకి వరసకు అత్త ఐనా తనకి మంచి చెడు చెప్తూ, ప్రెసిడెంట్ ఘోరాలు, నేరాలు రివీల్ చేసే పాత్ర… అనసూయ తప్ప ఇంకెవరు చేయలేరేమో అనిపించింది ఫైనల్లీ.
జబర్దస్త్ మహేష్: చంపేశాడు … ఎక్కడా తొణికినట్టు అనిపించలేదు …చిట్టిబాబుకి నాన్నకి జరిగినఅవమానం రివీల్ చేసేప్పుడు నా అటెంషన్ అంతా మహేష్ మీదేఉంది… అండ్ చిట్టిబాబు కుమార్ బాబు డెడ్ బాడీని తీసుకొచ్చేప్పుడు మహేష్ రియాక్ట్ ఐన విధానానికి కళ్ళు చెమ్మగిల్లాయి.

ప్రకాష్ రాజ్, రోహిణి, శేషు, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ:
అందరూ సినిమాలో చిన్న చిన్నపాత్రలలో ఏ ఒక్కటి వేస్ట్ కాలేదు. సింగల్ షాట్ లో కనిపించిన వాళ్ళుకూడా రంగస్థల నటులులానే అనిపించారు.

టెక్నీకల్:
అందరికన్నా ముందుగా నేనుచెప్పాలంటే ఆర్ట్ గురించే చెప్తా. అలాంటి ఊర్లు నాకు బాగా తెల్సు…
కుమార్ బాబు చనిపోయినప్పుడు నిజమైన అంత్యక్రియ విధానాలు, సాంప్రదాయాలు చిన్నప్పటి తర్వాత మళ్లీ సినిమాలో చూసాను. మట్టిగోడలు, వీధుల్లో బోరింగుల చుట్టుపక్కల వస్తువులు, వార్డుమెంబర్స్ గా నిలబడమని అడిగే సీన్స్అప్పుడు ఒకింట్లో కుండలు, ఇంకోఇంట్లో వలలు ఇలా ఎక్కడా పేర్లువాడకుండా కేవలం ప్రాపర్టీస్ ద్వారా కులాలు చెప్పేసారు.
ఆర్ట్ కి తోడైంది కెమెరా వర్క్:
లొకేషన్స్ ని, ఆర్ట్ ని, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ ని, సీన్స్ కి తగ్గట్టు ఎమోషన్స్ కి తగ్గట్టు కరెక్ట్ గా రాబట్టారు. ఆదిని చరణ్ సేవ్ చేసేప్పుడు మూమెంట్స్ ఇంకా నచ్చాయి.
కెమెరా వర్క్ కి, యాక్టర్స్ ప్రేర్మార్మెన్స్ కి సరైన న్యాయం చేసింది మాత్రంమ్యూజిక్
కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ దగ్గర మ్యూజిక్లేకుండా ఉండటాన్ని బట్టే చెప్పొచ్చు ఫీల్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా కనెక్ట్ ఐపోయాడో …సాంగ్స్ ఏది కూడా వేస్ట్ పోలేదు ఈ మధ్య కాలంలో ఇది గమనించింది రంగస్థలానికే
లిరీక్స్ అబ్బబ్బ దండాలయ్యా:
ఒక మనిషి చనిపోయాక అతను వాడిన థింగ్స్ ఫీలింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లిరిక్స్ రాయాలన్న థాట్ కే నమస్కారం

మేకప్

చిట్టిబాబు కర్రతో కొట్టి ప్రెసిడెంట్ ని చంపేసాక కెమెరా చిట్టిబాబు మీద నుండి ప్రెసిడెంట్ మీదకి పాన్ అవుతుంది. అప్పుడు గాయాలు ఎంత నాచ్యురల్ గాఉన్నాయంటే … క్రైమ్ సీన్స్ లలో ‘టరంటినో’ సినిమాల్లో చూసా, అండ్ ఆర్.జీ. వి 26/11 మూవీ లో చూసా తర్వాత ఇప్పుడే.స్టడీ చేసి వర్క్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది మరి… డైలాగ్స్, కాస్ట్యూమ్స్, సౌండ్స్, ఎడిటింగ్ అండ్ ఎవిరీ థింగ్ ఈజ్ పర్ఫెక్ట్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com