‘రంగ‌స్థ‌లం’ ట్రైల‌ర్‌: పల్లెటూరిలో మ‌రో కోణం


ప‌ల్లెటూరంటే..ప‌చ్చని చెట్లు, పంట పొలాలు, గ‌ల గ‌ల పారే సెల‌యేర్లూ… మ‌న తెలుగు సినిమాల‌న్నీ ఇలానే చూపించాయి. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సుకుమార్ ఓ సినిమా తీస్తాడ‌న‌గానే.. ఈసారీ అదే ప‌చ్చ‌ద‌నం వెండి త‌ర‌పై ధార‌బోస్తాడ‌నిపించింది. కానీ… ‘రంగస్థ‌లం’ క‌థ మ‌రోలా ఉంది. ప‌ల్లెటూర్ల‌లో ఉండే `రా`నెస్.. ఈ ట్రైల‌ర్లో క‌నిపించింది. అక్క‌డి రాజ‌కీయం, కుళ్లు, కుతంత్రం కూడా ద‌ర్శ‌న మిచ్చాయి. పాత్ర‌లు. అవి ప‌లికే మాట‌లు, వాళ్ల ఎమోష‌న్స్ చూస్తుంటే.. సుకుమార్ త‌ప్ప‌కుండా `ప‌ల్లెటూరి`కి అద‌ర్ సైడ్ చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడేమో అనిపిస్తోంది. 1980 నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆ వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు. ఇదీ మాస్ సినిమానే. కాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కూ చూసిన మాస్ సినిమాల ల‌క్ష‌ణాలేం తెర‌పై క‌నిపించ‌లేదు. ఆ విష‌యంలో సుకుమార్‌ని మెచ్చుకోవాలి. సాధార‌ణంగా త‌మిళ సినిమాల్లో క‌నిపించే రానెస్ ఈ సినిమాలో చూపించి ఓ గొప్ప సాహ‌సానికి పూనుకున్నాడు సుకుమార్‌. అన్నీ ఒక‌యెత్త‌యితే.. రామ్‌చ‌ర‌ణ్ మేకోవ‌ర్ మ‌రో ఎత్తు. దేవి ఆర్‌.ఆర్‌, ర‌త్న‌వేలు కెమెరా ప‌నిత‌నం, నిర్మాణ విలువ‌లు ఈ సినిమాని మ‌రో స్థాయిలో చూపించ‌డం ఖాయమ‌నిపిస్తున్నాయి. మొత్తానికి రంగ‌స్థ‌లం ట్రైల‌ర్ కొత్త‌గా ఉండి.. కోటి ఆశ‌లు రేపింది. అంతిమ ఫ‌లితం ఏంట‌న్న‌ది ఈనెల 30న తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.