రాశీఖ‌న్నా మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేసిన‌ట్టే!

న‌వ‌త‌రం క‌థానాయిక‌ల జోరుతో ఈమ‌ధ్య రాశీఖన్నా వెన‌క‌బ‌డిపోయింది. 2018లో ఆమె నుంచి చెప్పుకోద‌గిన సినిమాలేం రాలేదు. `తొలి ప్రేమ‌`లాంటి హిట్ త‌ర‌వాత కూడా.. భారీ అవ‌కాశాల్ని చేజిక్కించుకోలేక‌పోయింది. అయితే 2019 లో మాత్రం రాశీకి శుభ శ‌కునాలే క‌నిపిస్తున్నాయి. వ‌రుస‌గా సినిమాల‌పై సంత‌కాలు చేస్తోంది. ఇటు తెలుగు, అటు త‌మిళం రెండు చోట్లా హ‌వా చూపిస్తోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ – క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రాశీఖ‌న్నాని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. క్రాంతి మాధ‌వ్ సినిమాల్లో క‌థానాయిక‌ల పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంది. పైగా ఇది విజ‌య్ సినిమా. కాబ‌ట్టి రాశీ పాత్ర వ‌ర‌కూ ఢోకా లేక‌పోవొచ్చు. త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తి ప‌క్క‌న ఓ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకుంది రాశీ. విజ‌య్ చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేప‌థ్యంలో సాగుతుంట‌. మ‌రోవైపు శింబు పక్క‌న క‌థానాయిక‌గానూ ఎంపికైంది రాశీ. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. ఇవి కాక రాశీ మ‌రో రెండు తెలుగు చిత్రాల్లో న‌టించ‌డానికి అంగీక‌రించిందని తెలుస్తోంది. మొత్తానికి రాశీ ఫామ్ లోకి వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ అవ‌కాశాల్ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close