రష్మి కష్టం ఫలించలేదా..!

రీ ఎంట్రీతో రష్మి హాట్ హాట్ స్టిల్స్ తో ట్రైలర్స్ తో రెచ్చగొట్టేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూర్ టాకీస్ సినిమాతో రష్మి ఇక క్రేజీ హీరోయిన్ అవ్వడం ఖాయం అనేసుకున్నారు. కాని నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా చూస్తే రష్మి అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకుంది అన్నది అర్ధకాక తలపట్టుకున్నారు ఆమె అభిమానులు. జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాధించిన రష్మి గుంటూర్ టాకీస్ లో ఓ అర్ధరహిత పాత్ర చేసింది అనే అనాలి.

సినిమాలో కొంచం విషయం ఉన్నట్టు అనిపించినా అది హీరోగా చేసిన సిద్ధు, సపోర్ట్ గా చేసిన సీనియర్ నటుడు నరేష్ లు చేసిన నటన వల్లే. ఇక గుంటూర్ టాకీస్ గురించి మొదటి నుండి హోప్స్ పెట్టుకున్న రష్మి మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. కేవలం తన సోయగాలతో ప్రేక్షకులను బుట్టలో వేసుకోవాలనే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. లిప్ లాక్స్, హాట్ సీన్స్ లో అమ్మడు ఎంత రెచ్చిపోయినా థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఈ సినిమా రష్మి ఎందుకు ఒప్పుకుని ఉంటుంది అనే డౌట్ వస్తుంది.

తన అభిమానులను అన్ని కోణాల్లో సాటిస్ఫై చేయాలనే తాపత్రయంలో రష్మి అసలు నటన మీద దృష్టి పెట్టడం మానేసిందని చెప్పాలి. ఇక సినిమాలో ఆమె పాత్రకు ఎక్కువ డైలాగ్స్ కూడా రాయకుండా ఆమెకు అన్యాయం చేశాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. మరి రష్మి హీరోయిన్ గా నెగ్గుకురావాలనుకుంటే స్కిన్ షోనే కాదు కాస్త కూస్తో నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో చేయాలని గుర్తిస్తే మంచి లేదంటే అమ్మడు ఇక బుల్లితెర షోలకే శాశ్వతంగా పరిమితమవ్వాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close