అప్పుడెప్పుడో ర‌విబాబు అదిగో అనే సినిమా మొద‌లెట్టాడు. ఓ పంది పిల్ల ఈ సినిమాలో హీరో! పందిని ప‌ట్టుకొని పోజులు ఇచ్చి, ఏటీఎమ్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర క్యూలో నిల‌బ‌డి కాస్తో కూస్తో ప‌బ్లిసిటీ తెచ్చుకోగ‌లిగాడు ర‌విబాబు. కాక‌పోతే.. ఆ త‌ర‌వాత ఈ పంది అజా ప‌జా లేదు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోసం టైమ్ ప‌ట్టింద‌ని, త్వ‌ర‌లోనే ఈ సినిమాని విడుద‌ల చేస్తామ‌ని ర‌విబాబు చెబుతూనే ఉన్నాడు.కానీ.. అదిగో అడ్ర‌స్స్ దొర‌క‌లేదు. ఈ సినిమా ఒక‌టుంద‌ని మ‌ర్చిపోతున్న త‌రుణంలో ర‌విబాబు టీజ‌ర్ వ‌దిలాడు. ఓ పందిపిల్ల‌ని ప‌క్క‌న పెట్టుకొని కామెడీ చేశాడు. త‌న‌పై త‌నే సెటైర్లు వేసుకొన్నాడు. నిజానికి దీన్ని టీజ‌ర్ అని చెప్ప‌లేం. జ‌స్ట్ ప్రోమో అంతే. సినిమా ఎలా ఉండ‌బోతోందో, క‌థేంటో ఇప్ప‌టి వ‌ర‌కూ తెలీదు. ర‌విబాబు ప్ర‌మోష‌న్లు కాస్త వింత‌గా, విడ్డూరంగా ఉంటాయి. థియేట‌ర్‌కి వెళ్లేంత వ‌ర‌కూ అందులో ఎవ‌రెవ‌రు న‌టించారో కూడా తెలీదు. బ‌హుశా ఈసారీ అదే ఫార్ములాలో వెళ్తున్నాడేమో. గ్లామ‌ర్‌ని న‌మ్ముకొన్న ఈ ఫీల్డులో పందిని ప‌ట్టుకొని ప్ర‌చారం ఎలా చేస్తాడో మ‌రి. ఇప్పటికైతే ర‌విబాబు కాస్త అటెన్ష‌న్ తెచ్చుకోగ‌లిగాడు. మున్ముందు ఎలాంటి ప‌బ్లిసిటీ ఇస్తాడో చూడాలి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేయాల‌ని సురేష్‌బాబు, ర‌విబాబు ప్లాన్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.