ర‌విబాబు స‌రికొత్త ప్ర‌యోగం

న‌టుడిగా ర‌విబాబు పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేదు గానీ, ద‌ర్శ‌కుడిగా మాత్రం త‌న‌లోని వెరైటీ కోణాల్ని ఆవిష్క‌రిస్తూనే ఉన్నాడు. చిన్న బ‌డ్జెట్లో.. క‌ల‌ర్‌ఫుల్‌గా సినిమా తీయ‌డం ఎలాగో.. అల్ల‌రితో చూపించాడు. ప్ర‌తీ క‌థ‌, అందులో కాన్సెప్టులూ డిఫ‌రెంట్‌గా ఉండేలా డిజైన్ చేసుకొంటున్నాడు ర‌విబాబు. సినిమాలు ఫ్లాప్ అయినా, హిట్ట‌యినా… త‌న దారిలో తాను వెళ్తున్నాడు. తాజాగా ఇప్పుడో విభిన్న ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. ఓ జంతువుతో ర‌విబాబు ఓ సినిమా తీశాడ‌ట‌. సినిమా అంతా ఆ జంతువు క‌నిపిస్తుంద‌ట‌. దాని చుట్టూ హీరో, హీరోయిన్ల పాత్ర‌లు కూడా సృష్టించాడ‌ట‌. రాజ‌మౌళి ఈగ‌తో సినిమా తీశాడు క‌దా.. ఆ స్ఫూర్తితో మ‌నోడు కూడా ఓ క‌థ అల్లేసుకొన్నాడ‌న్న‌మాట‌.

సాధార‌ణంగా హాలీవుడ్ సినిమాల‌నో, కొరియ‌న్ సినిమాల‌నో చూసి ఇన్‌స్పైర్ అయి సినిమాలు తీస్తుంటాడు ర‌విబాబు. ఈసారి ఏ క‌థ‌ని స్ఫూర్తిగా తీసుకొన్నాడు. ఇంకో షాకింగ్ విష‌యం ఏంటంటే.. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిపోయి, తొలికాపీ కూడా సిద్ధ‌మైపోయింద‌ట‌. ఎలాంటి హ‌డావుడి లేకుండా సినిమా మొద‌లెట్ట‌డం, దాన్ని పూర్తి చేయ‌డం కూడా జ‌రిగిపోయాయ‌న్న‌మాట‌. మ‌రి ర‌విబాబు ప్ర‌యోగం ఏమేర‌కు అల‌రిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close