సాహ‌సం: పంది పిల్ల హీరోగా

ర‌విబాబు ఓ సాహ‌సోపేత‌మైన సినిమా తీస్తున్నాడ‌న్న సంగ‌తిని తెలుగు 360. కామ్ నిన్న‌నే చెప్పింది. ఆ సాహ‌సం ఏంట‌న్న‌ది ఈరోజు రివీల్ అయ్యింది. ర‌విబాబు ఓ పంది పిల్ల‌తో సినిమా తీస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్రెడీ పూర్త‌యిపోయింది. ఓ కొత్త హీరో, ఓ కొత్త హీరోయిన్ న‌టిస్తున్నా… కాన్సెప్ట్ అంతా పంది పిల్ల చుట్టూనే తిరుగుతుంద‌ట‌. ఈగ సినిమా ఈగ చుట్టూ తిరిగిన‌ట్టు. జురాసిక్ పార్క్ సినిమాకి వాడిన టెక్నాల‌జీని ఈ సినిమా కోసం ఉప‌యోగించామ‌ని ర‌విబాబు చెబుతున్నాడు.

పందిపిల్ల‌తో సినిమా ఏంటండి బాబూ అని అడిగితే.. ”ఏ జంతువైనా చిన్న‌ప్పుడు చాలా బుజ్జిగా ఉంటుంది. పంది కూడా అంతే క్యూట్ గా క‌నిపించింది. అంద‌రూ కుక్క‌ల‌తో, పిల్లుల‌తో, కోతుల‌తో సినిమాలు తీశారు. అందుకే వెరైటీగా ఉంటుంద‌ని పంది పిల్ల‌తో సినిమా తీశా” అంటున్నాడు ర‌విబాబు. మూడు నెల‌ల క్రిత‌మే షూటింగ్ ప్రారంభ‌మై, ఇప్ప‌టికి పూర్త‌యింద‌ట‌. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఉండే అంశాల‌న్నీ ఇందులో ఉంటాయ‌న‌ని, కాక‌పోతే… పంది పిల్ల మాత్రం సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ అని అంటున్నాడు. మ‌రి ఈ ప్ర‌యోగం ఎంత వ‌ర‌కూ స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close