ఎక్స్‌క్లూజివ్ : టీవీ9 వివాదం..! అసలు కథ చెప్పిన రవిప్రకాష్..!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్.. మొదటి సారి.. తన వెర్షన్ విడుదల చేశారు. ఆయన పరారీలో ఉన్నారని.. అదని.. ఇదని జరుగుతున్న ప్రచారంతో.. అసలు జరిగిందేమిటో బయట పెట్టేందుకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే చదువుదాం..!

రవిప్రకాష్ వీడియో చెప్పింది… చెప్పినట్లుగా..!

నేను.. ఎలక్ట్రానిక్ మీడియాలో అడుగు పెట్టినప్పుడు… వెంచర్ క్యాపిటలిస్ట్‌గా… శ్రీనిరాజు పెట్టుబడి బెట్టారు. దేశం మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా నష్టాల్లో ఉన్నప్పుడు .. నేను టీవీ9ను ప్రారంభించి లాభాల్లోకి తెచ్చాను. ఒక్క తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా టీవీ9 చానళ్లు విస్తరించాయి. అగ్రగామిగా నిలిచాయి. చివరికి శ్రీనిరాజు… తాను లాభాలతో సంస్థ నుంచి బయటకు వెళ్తానని చెప్పారు. దానికి అంగీకరించాను. నేను పెట్టుబడిదారులతో కూడా మాట్లాడను.

టీవీ9 షేర్లను శ్రీనిరాజు అమ్మాలనుకున్నప్పుడు… ప్రముఖ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి వచ్చి ..మరో నలుగురితో కలిసి…ఏబీసీఎల్ లో పెట్టుబడి పెడతామన్నారు. మొత్తం మెజార్టీ షేర్ ఎవరి దగ్గరా ఉండదని చెప్పారు. కొనుగోలు తర్వాత మొత్తం ఎడిటోరియల్ స్వేచ్చ రవిప్రకాష్ కు ఇస్తామని మాట ఇచ్చారు. అయితే ఎక్కువ వాటాదారుగా మేఘా కృష్ణారెడ్డి ఉంటారనుకుంటే.. ఆ స్థానంలో రామేశ్వరరావు వచ్చి చేరారు. ఎవరికీ మెజార్టీ వాటాదారుగా ఎవరూ ఉండరని చెప్పి.. ఇప్పుడిలా చేశారేమిటని..మేఘా కృష్ణారెడ్డిని అడిగాను. తర్వాత మెజార్టీ వాటాదారుగా… మారిన రామేశ్వరరావు తో మాట్లాడాను.. నేను సంస్థను ప్రారంభించాను.. డెవలప్ చేశాను.. కాబట్టి… కొత్తగా సంస్థను కొన్నారు కాబట్టి.. ఓ ఒప్పందం చేసుకుందామని అడిగాను.. ఇది చట్టప్రకారంగా ఉండాల్సిన అగ్రిమెంట్ కూడా..!

కానీ.. తనది కుటుంబ వ్యాపారం.. ఎలాంటి ఒప్పందం చేసుకోబోమని..రామేశ్వరరావు చెప్పారు. అంతే కాదు.. తన దగ్గర .. ఓ జీతగాడిలా.. పాలేరులా పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో.. తాను ఎలాంటి ఇబ్బందులు అయినా పెట్టగలనని బెదిరించారు. టీవీ9 సంస్థ నుంచి బయటకు పంపుతానని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు దానికి తగ్గట్లుగానే ఉన్నాయి. నాపై మూడు దొంగ కేసులు పెట్టారు. ఎయిర్ పోర్టుల్లో, షిప్ యార్డుల్లో అలర్టులు పెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. రామేశ్వరరావు అధీనంలో ఆయన.. ప్రభావంతో పని చేస్తున్న సంస్థలు.. రవిప్రకాష్ అనే ఉగ్రవాది పారిపోయాడన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రామేశ్వరావు పెట్టిన మూడు తప్పుడు కేసులేమిటో.. చెప్పదల్చుకున్నాvg.

మొదటి కేసు ..!

రవిప్రకాష్, శివాజీ.. ఒక ప్రైవేటు ఒప్పందం చేసుకున్నారు. దానిపై.. రామేశ్వరరావు బంధువు ఫిర్యాదు చేస్తారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇది అత్యంత హాస్యాస్పతమైన విషయం. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు ఎన్సీఎల్టీ కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉన్న పత్రాలను.. ఎఫ్‌ఐఆర్‌గా మార్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇది పోలీసుల అజ్ఞానం అయినా అయి ఉండాలి.. చట్టాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తాం.. మమ్మలను ఎవరు అడ్డుకుంటారని… భావించడం కావొచ్చు.

ఇక రెండో కేసు..

మరింత హాస్యస్పదమైన కేసు.. టీవీ9 సీఈవోగా రవిప్రకాష్ పని చేస్తున్న సమయంలో.. ఆయన వద్ద కంపెనీ సెక్రటరీగా .. పార్ట్ టైమ్ గా పని చేస్తున్న దేవేందర్ అగర్వార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. రాజీనామా చేసినట్లుగా అప్ లోడ్ చేశారు. నిజం ఏమింటేటే.. ఈ కంపెనీ సెక్రటరీ దేవందర్ అగర్వాల్ అనే వ్యక్తిని… రామేశ్వరరావు మనుషులు కిడ్నాప్ చేసి.. రాత్రంతా హింసించి.. ఆయనతో తెల్లవారుజామున రెండు గంటలకు… వెబ్‌సైట్లో కొత్త డైరక్టర్ల పేర్లను అప్ లోడ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ అప్ లోడింగ్ ఫెయిలయింది. ఎందుకంటే.. దేవేందర్ అగర్వాల్.. అప్పటికే… తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారు ఓ మాజీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి… అతని ద్వారా… దొంగతనంగా డైరక్టర్లను పెట్టడానికి ప్రయత్నించారు. ఇప్పటికే స్టే ఉన్న దాంట్లో… డైరక్టర్లను తప్పుడుగా నియమించే ప్రయత్నం చేశారు. పైగా… నేనే… దేవందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా.. తప్పుడు కేసును పెట్టే ప్రయత్నం చేశారు. ఇది చాలా హాస్యస్పదమైన విషయం. నేను.. రామేశ్వరరావునో… మేఘా కృష్ణారెడ్డి సంతకాలను ఫోర్జరీ చేస్తే చెప్పుకోవాలి కానీ.. ఓ పార్ట్ టైమ్ ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు చెప్పడం.. దానికేదో ఆధారాలున్నాయని.. సృష్టించడానికి ప్రయత్నించడం.. అత్యంత హాస్యస్పదమైన చర్య.

ఇక మూడో కేసు..

టీవీ9 లోగోలను రవిప్రకాష్ తీసుకున్నాడని.. దొంగతనంగా అమ్మేశాడని… కేసు పెట్టారు. టీవీ9 అనే పేరు సృష్టికర్త రవిప్రకాష్. టీవీ9 లోగో సృష్టికర్త రవిప్రకాష్… ఇలాంటి రవిప్రకాష్‌కు… టీవీ9పై పూర్తి హక్కులు ఉన్నాయి. టీవీ9 పేరు, లోగోకు ఆయన యజమాని. దీనిపై రవిప్రకాష్‌కు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కప్పి పుచ్చి… ఆ లోగో ఏదో నేను తీసుకుని పారిపోతున్నట్లుగా.. ప్రచారం చేస్తూ కేసు పెట్టారు. ఇది మరింత హాస్యస్పదమైన విషయం. ఎందుకంటే… ముందుగా.. ఆ లోగోకు యజమాని ఎవరో ముందుగా వారు తెలుసుకుని ఉండాల్సింది. సంస్థను కొనేటప్పుడే.. దాన్ని తెలుసుకోవాల్సింది.

హైదరాబాద్ పోలీసుల వ్యవహారం చూస్తూంటే… పోలీసు వ్యవస్థ మొత్తం.. మైహోం గ్రూప్ సంస్థల్లో భాగం అయినట్లుగా కనిపిస్తోంది. రామేశ్వరరావు నేరుగా… పోలీసులకు ఆదేశాలిస్తున్నారు. రవిప్రకాష్ ఇంటిపై దాడులు చేయండి… మహిళల్ని భయభ్రాంతులకు గురి చేయండి.. రవిప్రకాష్ సన్నిహితులను అదుపులోకి తీసుకోండని .. అని ఆయనే నేరుగా ఆదేశిస్తున్నారు. పోలీసులు తూ.చ తప్పకుండా పాటిస్తూంటారు. ధనిక స్వాములు ఎంతయినా బలంగా ఉండొచ్చు. వారి చేతిలో అధికారం ఉండొచ్చు. అంత మాత్రాన… ఓ టీవీ చానల్ సీఈవోను వేధించడానికి ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉందా.. అన్న అనుమానం వస్తోంది.

ఇప్పుడు నా ముందున్న ప్రశ్న ఒక్కటే…

ఇంత కాలం.. నేను నమ్మిన జర్నలిజం.. విలువలు, సమాజహితానికి అనుగుణంగా పని చేయాలా.. లేక నన్ను నమ్మిన కొంత మంది ధనిక స్వాముల బలానికి .. కేసులకు భయపడి… వారికి పూర్తిగా ఊడిగం చేస్తూ ఉండిపోవాలా…?. నేను ఏమనుకుంటానంటే… భవిష్యత్ తరాలు మనల్ని గుర్తు పెట్టుకోవాలంటే… మనల్ని తల ఎత్తి చూడాలంటే.. కొన్ని విలువల్ని పాటించాలి. అదే అనుకుంటున్నాయి. అదే.. ధనిక స్వాములకు ఇంతగా.. ప్రజాస్వామ్యం దాసోహం అవడం.. ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. ప్రజలకు మంచిది కాదు. మీడియాకు మంచిది కాదు. సమాజానికి మంచిది కాదు.

సమాజహితం కోసం… నేను ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేస్తున్నారు. మిత్రులు, హితులందరి మద్దతు కోరుతున్నాను..
రవిప్రకాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.