మార్చిలో ‘డిస్కో రాజా’ మొదలు…

మాస్ మహరాజ్ రవితేజ కథానాయకుడిగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వీ ఐ ఆనంద్ తెరకెక్కించనున్న సినిమా ‘డిస్కో రాజా’. రామ్ తాళ్లూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజతో ‘నేల టికెట్’ చిత్రాన్ని నిర్మించింది ఈయనే. ఈ సినిమా షూటింగ్ మార్చి మొదటి వారంలో మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. తమన్ సంగీత సారథ్యంలో ట్యూన్స్ కూడా ఫైనలైజ్ చేశారు. షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత చక చకా చేసేయడమే. ఇందులో రవితేజ సరసన ముగ్గురు కథానాయకులు నటించనున్నారు. ఆర్ఎక్స్ 100 పోరి పాయల్ రాజ్ పుత్ మొదటి హీరోయిన్ కాగా… నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేశ్ రెండో హీరోయిన్. మూడో హీరోయిన్ ని త్వరలో సెలెక్ట్ చేయనున్నారు. తమిళ్ యాక్టర్ బాబీ సినిమా విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close