ర‌వితేజ‌… ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేది?

భ‌ర‌త్ మ‌ర‌ణం చిత్ర‌సీమ‌ను ఎంత షాక్ కి గురి చేసిందో తెలీదు గానీ, త‌మ్ముడి మ‌ర‌ణించిన త‌ర‌వాత ర‌వితేజ స్పందించిన‌ తీరు మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ర‌వితేజ త‌న త‌మ్ముడి ఖ‌ర్మ కాండ‌ల‌కు రాలేదు. స‌రిక‌దా.. భ‌ర‌త్‌ని అనాధ శ‌వంలా వ‌దిలేశారు. ఖ‌ర్మకాండ‌ల‌య్యే ఖ‌ర్చులు కూడా ర‌వితేజ భ‌రించ‌లేక‌పోయాడ‌ని.. మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఆ త‌ర‌వాత‌.. ర‌వితేజ ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ‘నా త‌మ్ముడు చ‌నిపోతే నాకు బాధ ఉండ‌దా? నా త‌మ్ముడ్ని ఆ ప‌రిస్థితిలో చూడ‌లేకే… అంత్య‌క్రియ‌ల‌కు రాలేదు’ అన్నాడు. అంతే కాదు.. ఈరోజు మీడియా ద‌గ్గ‌ర త‌న బాధ‌నంతా వెళ్ల‌గ‌క్కాడు. ‘ఏమైనా రాసేట‌ప్పుడు తెలుసుకొని రాయండి…’ అంటూ అభ్య‌ర్థించాడు. ర‌వితేజ బాధ అర్థం చేసుకోద‌గిన‌దే. అస‌లే పుట్టెడు దుఖంలో ఉన్నాడు. దాంతో పాటు లేనిపోని నింద‌లు మోయాల్సివ‌స్తోంది. అయితే.. ర‌వితేజ కూడా స‌మాధానం చెప్ప‌లేని, దాట‌వేస్తున్న ప్ర‌శ్న‌లు చాలా ఉన్నాయి.

త‌మ్ముడ్ని అనాథ శ‌వంలా ఎలా వ‌దిలేయాల‌నిపించింది? ‘నేను ఆ స్థితిలో త‌మ్ముడ్నిచూడ‌లేను’ అన‌డం అన‌డం కేవ‌లం తన‌ని తాను స‌మ‌ర్థించుకోవ‌డానికే అన్న‌ది నిర్వివాద అంశం. చివ‌రి చూపు అయినా ద‌క్కాల‌ని తాప‌త్ర‌య‌ప‌డాల్సిన ద‌శ‌లో.. త‌మ్ముడ్ని చూడ‌కుండా ఎలా ఉండ‌గ‌లిగాడు? నిజంగా బాధ ప‌డుంటే… త‌మ్ముడు చ‌నిపోయిన రెండో రోజే.. షూటింగ్‌కి ఎలా వెళ్ల‌గ‌లిగాడు. వెళ్లాడు స‌రే.. అక్క‌డ న‌వ్వుతూ సెల్పీలు ఎలా తీయించుకోగ‌లిగాడు? ‘త‌మ్ముడ్ని అలా వ‌దిలేయ‌కండి’ అంటూ ర‌వితేజ మాతృమూర్తి చాలాసార్లు ర‌వితేజ‌ని ప్రాధేయ‌ప‌డింద‌ట‌. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్‌, వాటి వివ‌రాలు మీడియా ద‌గ్గ‌ర ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయినా స‌రే, ర‌వితేజ దిగి రాలేదు. మీడియాలో కొన్ని త‌ప్పుడు వార్త‌లు వ‌చ్చిన మాట నిజ‌మే. కానీ.. రాసిన వార్త‌ల‌న్నీ త‌ప్పే అంటే ఎలా?? ఇది పూర్తిగా ర‌వితేజ సొంత విష‌యం కావొచ్చు. కానీ.. త‌న త‌ప్పుల్ని మీడియావైపు నెట్టేసే ప్ర‌య‌త్నం అయితే జ‌రిగింది.. జ‌రుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.