ఆడియోలో పవన్‌ ఏం చేశాడంటే?: రవితేజ

రవితేజ ‘నేల టిక్కెట్టు’ ఆడియోకి పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అంతకు ముందెన్నడూ ఇతర హీరోల వేడుకల్లో సందడి చేయనంతగా సందడి చేశాడు. వేడుకలో ఉన్నంతసేపూ సరదాగా కనిపించాడు. పవన్‌, రవితేజ మధ్య ఉన్న అనుబంధం చూసి ఆడియన్స్‌ ఆశ్చర్యపోయారు. అయితే… ఆడియో వేడుక ముగిసిన తర్వాత అసలు ఘట్టం మొదలైంది. రవితేజ ప్యాంటులో పవన్‌ వేలు పెట్టినట్టుగా ఉంటే స్టిల్‌ వైరల్‌ అయ్యింది. పవన్‌ ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురుచూసే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అయితే… ఇద్దరిదీ తొడ సంబంధం కింద అభివర్ణించారు ట్విట్టర్‌లో! అక్కణ్ణుంచి ఈ ఫొటోపై విపరీతమైన ట్రోల్స్‌ మొదలయ్యాయి. వర్మ కామెంట్స్‌, ట్రోల్స్‌పై రవితేజను అడగ్గా… ఈ రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

‘‘పవన్‌ ఆ రోజు ఏం చేశాడంటే… నేను టోన్డ్‌ జీన్స్‌ (చిన్న చిన్న చిరుగులు ఉంటే జీన్స్‌) వేసుకున్నాను కదా! ఆయన అది చూశారు. ఓ చోట దారాలు దారాలుగా ఉంది. వాటిలో ఓ దారాన్ని పట్టుకుని లాగారు. అంతకు మించి ఏం లేదు. దాని మీద ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్‌ చేశారు. పోన్లెండి’’ అని రవితేజ వ్యాఖ్యానించారు. కామెంట్స్‌ని ఆయన లైట్‌ తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close