అఫీషియల్‌: ర‌వితేజ ‘రావ‌ణాసుర‌’

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అభిషేక్ నామా నిర్మాత‌. ఈ చిత్రానికి `రావ‌ణాసుర‌` అనే పేరు ఖరారు చేశారు. దాంతో పాటు ఫ‌స్ట్ లుక్ ని కూడా విడుద‌ల చేశారు. సింహాస‌నం పై కూర్చున్న ర‌వితేజ స్టిల్ అది. రావ‌ణాసురుడిలా.. ప‌ది త‌ల‌లు ప్ర‌తిబింబించేలా ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేశారు. క‌థానాయ‌కుడి పాత్ర‌లో నెగిటీవ్ షేడ్స్ ఉంటాయ‌ని టైటిల్ లోనూ, ఫ‌స్ట్ లుక్ లోనూ అర్థ‌మ‌వుతూనే ఉంది. మ‌రి ఈ రావ‌ణాసుర రివైంజ్ ఎవ‌రిపైనో చూడాలి. శ్రీ‌కాంత్ విస్సా ఈచిత్రానికి క‌థ అందించారు.ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. ర‌వితేజ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ఖిలాడీ రెడీ అయిపోయింది. రామారావు సెట్స్‌పై ఉంది. ధ‌మాకా, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇది. రామారావు షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే.. ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close