కేసీఆర్ అనంత ప‌ర్య‌ట‌న‌లో ఇన్ని కోణాలా..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచ‌ల‌నం అవుతుంది! అలా కావాల‌నే ఆయ‌న చేస్తారో… లేదంటే, ఆయ‌న చేస్తున్న ప‌నుల్ని అలా చూస్తారో తెలీదుగానీ.. చ‌ర్చ అయితే కావాల్సినంత ఉంటుంది! తాజా విష‌యం ఏంటంటే… స్వ‌ర్గీయ ప‌రిటాల ర‌వి కుమారుడు శ్రీ‌రామ్ వివాహ వేడుక‌ ప‌రిటాల స్వ‌గ్రామంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలుగు రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఈ వేదిక‌పై క‌లుసుకుని కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకున్నారు. కేసీఆర్ గ‌తంలో టీడీపీలో ఉండ‌గా ప‌రిటాల ర‌వితో మంచి సాన్నిహిత్య‌మే ఉండేది. అందుకే, కేసీఆర్ ను స్వ‌యంగా ఆహ్వానించారు ఏపీ మంత్రి ప‌రిటాల సునీత‌. అయితే, ఈ వివాహం సంద‌ర్భంగా ఒక ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేపి కేసీఆర్ వెళ్లిపోయారు!

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనంత‌పురం చేరుకున్న ద‌గ్గ‌ర నుంచీ టీడీపీ నేత ప‌య్యావుల కేశ‌వ్ గురించి అడ‌గడం మొద‌లుపెట్టార‌ట‌! ఆయ‌న ఎక్క‌డా ఎక్క‌డా అంటూ ప‌లువురు నేత‌ల‌ను అడిగారు. తిరుగు ప్ర‌యాణం అవుతూ ఉండ‌గా.. త‌న‌ను ప‌ల‌క‌రించి వెళ్లిపోయిన ప‌య్యావుల‌ను మ‌ళ్లీ పిలిచారు కేసీఆర్‌. త‌న వాహ‌నంలో ఎక్కించుకుని హెలీప్యాడ్ వ‌ర‌కూ తీసుకెళ్లారు. అక్క‌డ కూడా త‌న‌తో వ‌చ్చిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు వంటి నేత‌ల్ని కూడా ప‌క్క‌న‌బెట్టి.. ప‌య్యావుల‌ను మాత్రం కాస్త దూరంగా తీసుకెళ్లి, కొద్దిసేపు ఏకాంత చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇప్పుడీ ఘ‌ట‌నే ఆస‌క్తిక‌రంగా మారింది. అంత ర‌హ‌స్యంగా ప‌య్యావుల‌తో కేసీఆర్ ఏం మాట్లాడి ఉంటార‌నేదానిపై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ అనుస‌రించిన వ్యూహం గురించి ప‌య్యావుల‌ను అడిగి ఉంటార‌ని కొంద‌రు అంటున్నారు. ఎందుకంటే, న‌ల్గొండ ఉప ఎన్నిక‌కు కేసీఆర్ సిద్ధ‌మౌతున్నారు క‌దా! రాష్ట్రంలో పోల‌వ‌రం ప్రాజెక్టు వంటి కార్యక్ర‌మాల‌పై ఆరా తీసి ఉంటార‌ని కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. నిజానికి, ఈ విష‌యాలు ప‌య్యావుల నుంచే రాబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు క‌దా! ప‌క్క‌కు పిలిచి మ‌రీ అంత ర‌హ‌స్యంగా అడ‌గాల్సిన అంశాలు ఇవి కావు.

మొత్తంగా, కేసీఆర్ అనంత ప‌ర్య‌ట‌న‌పై వినిపిస్తున్న మ‌రో విశ్లేష‌ణలో పూర్తి రాజ‌కీయ కోణ‌మే ఉండ‌టం విశేషం! ప‌రిటాల స‌మాధి సంద‌ర్శ‌నం, ప‌య్యావుల‌తో ర‌హ‌స్య భేటీ, సీఎం చంద్ర‌బాబుతో కుశ‌ల ప్ర‌శ్న‌లు, వెరసి వీటన్నింటి వెన‌క కేసీఆర్ ల‌క్ష్యం వేరే ఉంద‌ని అంటున్నారు! అదేంటంటే, తెలంగాణ‌లోని సెటిల‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని, వారిని ఆక‌ర్షించే ల‌క్ష్యంగా ఈ ప‌ర్య‌ట‌న సాగింద‌ని కూడా కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న తెలంగాణ‌లోని ‘ఆ’ సామాజిక వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర కావ‌డం అనేది కూడా ఇందులో మ‌రోకోణంగా రాజ‌కీయ వ‌ర్గాలు చూస్తున్నాయి. మొత్తానికి, ఏదైతేనేం… ప‌రిటాల శ్రీ‌రామ్ వివాహ వేదికపై కేసీఆర్ కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపిన‌ట్టు అయింద‌ని చెప్పుకోవ‌చ్చు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close