వైసీపీ ఎంపీల రాజీనామాల్లో కదలిక..! ఉపఎన్నికల కోసమేనా..?

జూన్ మొదటి వారంలో వైసీపీ ఎంపీల రాజీనామాలను… స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదిస్తారని..ఆ తర్వాత ఉపఎన్నికలు వస్తాయని ముఖ్యమంమత్రి చంద్రబాబు కొద్ది రోజుల కిందట..తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చెప్పారు. చెప్పడమే కాదు.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన ఐదు స్థానాల్లో వెంటనే పార్టీ పరిస్థితిని సమీక్షించారు. కడప, రాజంపేట, తిరుపతి , నెల్లూరు, ఒంగోలు నేతలను పిలిపించి మాట్లాడారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు.. వైసీపీ ఎంపీల రాజీనామాల విషయంలో కదలిక వచ్చింది. ఈ నెల 29వ తేదీన తనను కలవాల్సిందిగా వైసీపీ ఎంపీలకు స్పీకర్ సమాచారం ఇచ్చారు.

కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన… యడ్యూరప్ప, శ్రీరాములు .. అప్పటి వరకు ఎంపీలుగా ఉన్నారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు వెళ్లబోయే ముందు ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారు. దీన్ని వెంటనే ఆమోదించినట్లు ప్రచారం జరిగింది. అప్పటికప్పుడు వారి రాజీనామాలు అమోదిస్తే.. ఎప్పుడో చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాలను ఎందుకు పట్టించుకోలేదన్న సందేహం ప్రజల్లో ప్రారంభమయింది. దీనిపై విమర్శలు పెరుగుతున్నాయి. దీంతో నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌పై ఒత్తిడి చేయాల్సిన తప్పని పరిస్థితి వైసీపీపై పడింది. ఇరవై తొమ్మిదో తేదీన వైసీపీ ఎంపీలతో వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత… మరో వారం రోజుల్లో స్పీకర్ .. వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

అయితే కర్ణాటక ఎంపీల రాజీనామాల విషయంలోనూ ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం యూటర్న్ తీసుకుంది. యడ్యూరప్ప, శ్రీరాముల రాజీనామాలు ఇంకా అధికారికంగా ఆమోదించలేదని మీడియాకు లీకులు ఇచ్చింది. దానికి ఇంకా పదిహేను రోజుల సమయం ఉందని చెప్పుకొస్తున్నారు. ఒక వేళ అసెంబ్లీలో ఓటింగ్ జరిగి … ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఓటు హక్కు వినియోగించుకుంటే… న్యాయపరమైన చిక్కుల్లో పడి ఉండేవారు. అందుకే అప్పటికప్పుడు ఆమోదిస్తున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ కొత్త చిక్కు వచ్చి పడింది. యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలు ఆమోదిస్తే.. బీజేపీ మెజార్టీ మైనార్టీలోకి పడిపోతుంది. ఇప్పుడు బీజేపీకి 271 మంది సభ్యులు ఉన్నారు. అందుకే శ్రీరాములును లోక్‌సభ సభ్యుడిగా కొనసాగించాలని నిర్ణయించింది. శ్రీరాములు తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు స్పీకర్‌కు నేడో రేపో లేఖ రాయనున్నారు.

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే.. ఉపఎన్నికలు వస్తాయా..? అన్నదానిపై ఇప్పటికీ రాజకీయవర్గాల్లో అనుమానాలున్నాయి. ఏడాది లోపు పదవి కాలం ఉంటే… ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం అనేది.. ఎన్నికల కమిషన్ ఇష్టం. ఈసీ కేంద్రం చెప్పినట్లు చేస్తుంది కాబట్టి.. ఇప్పుడు బీజేపీకి ఉపఎన్నికలు తెచ్చి పెట్టాలని ఉంటే మాత్రం కచ్చితంగా వస్తాయి. లేదంటే లేదు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close