బన్నీ త్రిముఖ వ్యూహం

మహేష్ హర్డ్ అయ్యాడు. సుకుమార్ హర్ట్ అయ్యాడు. పైకి చెప్పకపోయినా, మైత్రీ మూవీస్ గట్టి దెబ్బ తినేసింది. టోటల్ వ్యవహారంలో ‘భలే..భలే’ అనుకుంటున్నది బన్నీ క్యాంప్ నే అనుకోవాలి. ఎందుకంటే ఈ వ్యవహారం ఇంత అడ్డగోలుగా ముగియడానికి కారణం ఆ క్యాంప్ నే కాబట్టి. ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు, అటు త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాను ఉన్నట్లుండి వ్యూహాత్మకంగా ప్రకటించడం అంటే అంతకన్నా ఏం అనుకోవాలి.? ఇలా ప్రకటించడం వెనుక సుకుమార్ సైడ్ కారణాల సంగతి ఎలా వున్నా? బన్నీ సైడ్ కారణాలు వేరు. ఆ వ్యూహం వేరు.

జనాలకు తెలియని పాయింట్ ఒకటి వుంది. ఈ టోటల్ వ్యవహారం వేనుక మరో డైరక్టర్ వ్యవహారం కూడా వుంది. అదే అనిల్ రావిపూడి. స్టయిలిష్ స్టార్ డైరక్టర్ల కోసం వెదుకలాట చేస్తున్న టైమ్ లో అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయాలనుకున్నాడు. పిలిచి చెప్పాడు. అలాగే అన్నాడు. కానీ వన్ ఫైన్ మార్నింగ్, గత ఆగస్టులోనే మహేష్ కు కథ చెప్పాడు. ఓకె అయింది. ఆ తరువాత బన్నీ దగ్గరకు వచ్చి ఇలా ఓకె అయింది అని చెప్పాడు. సరే, అక్కడే చేయండి అని చెప్పి పంపేసారు.

అక్కడి నుంచి రగులుతోంది. తము చేయాలనుకున్న డైరక్టర్ ను మహేష్ లాగేసాడు అని. టైమ్ కోసం చూసారు. ఇప్పుడు కుదిరింది. మహేష్ దగ్గర కిందా మీదా అవుతున్న సుకుమార్ ను పిలిచి, డిస్కషన్లు పెట్టి ఒప్పించగలిగారు. ఆ విధంగా మహేష్ అనుకున్న డైరక్టర్ ను ఇటు లాగేసారు. తను కూడా హీరోనే కాబట్టి, హీరోల ఇగోలు, సెన్సిటివ్ నెస్ లు బన్నీ కి తెలియంది కాదు. అందుకే ఆ దిశగా వ్యూహరచన చేసి, అనౌన్స్ చేసారు. పైగా నిర్మాత, దర్శకుడు, హీరో కాకుండా జస్ట్ పీఆర్ టీమ్ తో ట్వీట్ వేయించారు. అనుకున్నాంతా అయ్యింది మహేష్ హర్ట్ అయ్యాడు. ప్రాజెక్టు క్యాన్సిల్ అన్నాడు.

త్రివిక్రమ్ కు అలెర్ట్ అంట

ఇదిలా వుంటే త్రివిక్రమ్ దగ్గర బన్నీ మాట సాగడం లేదు. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప, కనీసం ముహుర్తం కూడా చెప్పడం లేదు. ఇది బన్నీకి చాలా ఇబ్బందిగా వుంది. త్రివిక్రమ్ ఓ పక్కన బన్నీ స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతూ, మెగాస్టార్ చిరంజీవి స్క్రిప్ట్ ను కూడా తయారుచేస్తున్నారని బన్నీ క్యాంప్ కు అనుమానం వచ్చింది. అందుకే ఓ ఝలక్ ఇవ్వాలనుకున్నారు. ఆగస్టు నుంచి సుకుమార్ సినిమా అనే ఫీలర్ వదిలారు. ఆగస్టు కాకున్నా అక్టోబర్ కు స్టార్ట్ చేసారు. అంటే త్రివిక్రమ్ తన సినిమాను త్వరగా స్టార్ట్ చేయాలి. లేదూ అంటే మహేష్ కు సుకమార్ కు వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ లు ఇప్పడు బన్నీకి-త్రివిక్రమ్ కు వచ్చే ప్రమాదం వుంది.

మైత్రీకి తంటా

ఇప్పుడు ఉరిమి ఉరిమి ఎక్కడ పడాలో అక్కడ పడింది. మైత్రీ మూవీస్ కు వంద కోట్ల సినిమా చేజారిపోయింది. అంతే కాదు, మళ్లీ మహేష్ బాబు ఇప్పట్లో మైత్రీకి అవకాశం ఇస్తారా? అన్నది అనుమానమే. సుకుమార్ ఒక్కరూ బన్నీ దగ్గరకు వెళ్లి వుంటే అది వేరు. నిర్మాతతో సహా వెళ్లారు. అదే సమస్య. మైత్రీ మళ్లీ మహేష్ తో సినిమా చేయాలంటే అద్భుతం జరగాల్సి వుంటుంది.

మొత్తం మీద టాలీవుడ్ లోని రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య వున్న పోటీ, పోరు, మనస్పర్దలు ఇప్పుడు మరోసారి తెరవెనుక చాలా ప్రభావం చూపించాయి అన్న టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close