రేవంత్ రెడ్డి సొంత ఆఫీస్ ఎందుకు పెడుతున్నారు..?

తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సొంతంగా ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. సోమ‌వారం దీని ప్రారంభోత్స‌వం. అయితే, ఈ కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున ఆయ‌న నిర్వ‌హిస్తుండ‌టం విశేషం. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి కీల‌క నేత‌లంద‌రినీ ఆయ‌న ఆహ్వానించారు. పెద్ద సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తున్నార‌ని చెబుతున్నారు. ఇంత‌కీ, సొంత ఆఫీస్ ఎందుకంటే… ఎంపీగా ఆఫీస్ పెడుతున్నార‌ని అనుకోవ‌చ్చు. దీంతోపాటు, ఈ కార్యాల‌య కేంద్రంగా రాష్ట్ర‌ స్థాయి రాజ‌కీయ‌ కార్య‌క‌లాపాలు సాగించాల‌నే ల‌క్ష్యంతో రేవంత్ ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.

రేవంత్ ఆఫీస్ అంశం ఇప్పుడు కాంగ్రెస్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న సొంతంగా ఒక గ్రూపుని త‌యారు చేసుకునే వ్యూహంలో ఉన్నార‌నీ, ఒక కోట‌రీని త‌యారు చేసుకుంటార‌నీ, దాన్లో భాగమే ఈ ప్ర‌య‌త్న‌మ‌ని అంటున్న‌వారూ లేక‌పోలేదు. ఇక‌పై ఈ ఆఫీస్ లోనే త‌ర‌చూ రేవంత్ అందుబాటులో ఉండాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం. నిజానికి, పీసీసీ కొత్త అధ్య‌క్షుడి రేసులో రేవంత్ రెడ్డి పేరు మొద‌ట్నుంచీ వినిపిస్తున్న‌దే. అయితే, కొత్త‌గా చేరిన‌వారికి ఛాన్స్ ఇవ్వొద్దంటూ రేవంత్ అంటే ప‌డ‌ని ఒక వ‌ర్గ నేత‌లు ఇప్ప‌టికే హైక‌మాండ్ ద‌గ్గ‌ర త‌మ వాద‌న‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ‌, ఈ ఒత్లిళ్లేవో ప‌నిచేసి, పీసీసీ పీఠం త‌న‌కి ద‌క్క‌క‌పోయినా… తన ప్రాధాన్య‌త‌ను మ‌రింత‌ పెంచుకోవాల‌నే వ్యూహంలో రేవంత్ ఉన్న‌ట్టుగా అనిపిస్తోంది.

ఈ ఆఫీస్ లోకి వ‌చ్చాక రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించాల‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్టు స‌మాచారం. కేవ‌లం మ‌ల్కాగిరికి ప‌రిమితం కాకుండా రాష్ట్ర‌వ్యాప్తంగా త‌న ప‌రిధి అన్న‌ట్టుగా త్వ‌ర‌లో ఆయ‌న కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని చెబుతున్నారు. చిన్నాపెద్దా అని సంబంధం లేకుండా, ఏ స్థాయి నాయ‌కులు త‌న‌ను పిలిచినా ఇక‌పై అన్ని కార్య‌క్ర‌మాల‌కూ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. ఇలాంటి నిర్ణ‌యాలు కాంగ్రెస్ లో చాలామందికి మింగుడుప‌డ‌వు క‌దా! నిజానికి, కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రైనా గాంధీభ‌వ‌న్ నుంచే పార్టీ కార్య‌క్ర‌మాలు చూసుకుంటూ ఉంటారు. కానీ, రేవంత్ చ‌ర్య ఆ పార్టీ నేత‌ల‌కు కాస్త కొత్త‌గా అనిపించేదే. ఈ నేప‌థ్యంలో ఎంత‌మంది ఈ ఆఫీస్ ప్రారంభోత్స‌వానికి వ‌స్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close