ఇరుకు సందుల్లో సభలు పెట్టింది ఇందుకేనా?

ఇవాళ్టితో ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తుంది. రోడ్ షోలు, మైకుల మోత, జన సమీకరణలు ఇవన్నీ బంద్. ఈ సందర్భంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రచార సభలకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ ఎక్కడ సభ పెట్టినా… జనమే జనం అన్నట్టుగా మీడియాలో చూపించేవారు. డ్రోన్ కెమెరా షాట్స్ తో దారిపొడవునా జనాలే జనాలు అన్నట్టుగా సాక్షి ఛానెల్ ప్రసారం చేస్తుండేది. కొన్ని ఇతర న్యూస్ ఛానెల్స్ కూడా సాక్షి టీవీ ప్రసారాల డౌన్ లింక్ తీసుకుని, అవే విజువల్స్ వార్తల్లో చూపిస్తుండేవి. ఇక, సాక్షి పత్రికలో ఏ ఫొటో రైటప్ చూసినా ఒక వాక్యం కామన్ గా ఉంటూ వచ్చేది. అదే… ‘జగన్ సభకు హాజరైన జన సందోహంలో ఒక భాగం’ అనే వాక్యం.

ఇంతమంది జనాలు కనిపించేలా వైకాపా వర్గాల జనసమీకరణ ఒక ఎత్తు అయితే… జగన్ ప్రసంగించాల్సిన వేదికలను ఎంపిక చేయడంలోనే వైకాపా వ్యూహకర్తలు జాగ్రత్త వహించారట. ఒక్కసారి జగన్ ప్రచార సరళిని గమనిస్తే… ఆయన ఎక్కువగా సభలు నిర్వహించిన ప్రదేశాలు ఏవి..? జంక్షన్లు, రోడ్లు మీదే. భారీ బహిరంగ సభలు చాలా తక్కువ. మైదానాల్లో పెద్ద వేదికలు ఏర్పాటు చేసిందీ తక్కువ. ఇదంతా వ్యూహాత్మకంగా జరిగిందట. ఏంటా వ్యూహమంటే… ఒక గ్రౌండ్ లో సభ నిర్వహించాలంటే పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసి నింపాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టినా.. టీడీపీ వర్గాలు తీవ్రంగా ప్రచారం చేసేసుకుంటాయి. అందులో సగం వ్యయప్రయాలసతోనే సభలు నిర్వహించాలని అనుకున్నారట.

కాబట్టి, వీలైనంత వరకూ సభలన్నీ ఇరుకు రోడ్లు, జంక్షన్లలో నిర్వహించాలన్నది వ్యూహమట. ఇరుకు రోడ్లు అయితే జనాలను ఈజీగా నింపొచ్చు. పైగా, ఈ చివర నుంచి ఆ చివర వరకూ జనాలే జనాలు అన్నట్టుగా కనిపిస్తారు. ఒక గ్రౌండ్ లో సభకు జనసమీకరణ చేయడం కంటే.. ఒక వీధిలో అంతకంటే తక్కువ సంఖ్యలో జనాలుంటే చాలు. మొత్తం నిండిపోయినట్టు ఉంటుందనేది వ్యూహమట. వీధుల్లో అయితే డ్రోన్స్ కి అనువుగా ఉంటుందనీ, డ్రోన్ షాట్ కి కొంత ట్రావెల్ టైమ్ ఉంటుందనీ, ఆ విజువల్స్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి… ఇంత జనమా.. అనే ఇంపాక్ట్ ఉంటుందని ప్లాన్ చేశారట. స్టిల్ ఫొటోలకు కూడా రోడ్ల మీద అయితేనే కనుచూపుమేర జనం ఉన్నట్టుగా ఇమేజెస్ వస్తాయనీ ముందుగానే కేలిక్యులేట్ చేశారట. అందుకే, వీలైనంత వరకూ ఇరుకు సందులే సభావేదికలుగా పెట్టుకున్నారనీ, చివరికి ఆ సందుల్లో గోడలు విరిగిపడుతున్నా, ప్రజలకు గాయాలౌతున్నా వ్యూహం మార్చుకోలేదని సమాచారం.ఇక, ఈ సందుల్లో కూడా జనాలను గ్రాఫిక్స్ తో నింపారనే విమర్శలూ కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close