తముళ్లే కాదు, పెద్దన్నల తిరుగుబాట్లు

మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎంతో కొంత అసంతృప్తి కొందరిలో వ్యక్తం కావడం సహజమే గాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నంత తీవ్రత గతంలో ఉండేది కాదు. పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా తెలుగుదేశంలో అంతర్గత పరిస్థితి సరిగ్గా లేదనీ, అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటే శాసనంగా చలామణి అయ్యే దశ మారిందని స్పష్టమై పోయింది. దీర్ఘకాలంగా ఆయనకు సన్నిహితంగా వుంటూ అనేక ఆశలు పెంచుకున్న వారే ఇప్పుడు ఆగ్రహావేదనలకు గురి కావడం ఆసక్తికరం. వయసు రీత్యా గాని ఆరోగ్య పరంగా గాని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆయన కుమారుడికి అవకాశం ఇస్తారు గనక ఇది పెద్ద సమస్య కాదని అధికార ప్రతినిధులు చెబుతుంటే ఆ కుమారుడే అసంతృప్తిగా మాట్లాడ్డం మరో విశేషం. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం కూడా అలాటిదే. ఇక విజయవాడ సెంట్రల్‌ ఎంఎల్‌ఎ బోండా ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి పిలిచి బుజ్జగించిన తర్వాత కూడా నిష్ఘూరంగానే మాట్లాడుతున్నారు. తమ జిల్లా మంత్రులనే పరోక్షంగా సన్నాసులు అని ఒకటికి రెండు సార్లు తీసిపారేశారు. రాజమండ్రి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రధాన కార్యదర్శి పదవికిరాజీనామా చేయడం ఇంకా ఆశ్యర్యకరం.నిజానికి బుచ్చయ్య చౌదరి,బోండా ఉమల పేర్లు ఎప్పుడూ పరిశీలనలో లేవు.ప్రచారానికీ రాలేదు.అయినా వారు లోలోపల ఆశలు పెంచుకుని నిరుత్సాహానికి గురయ్యారన్నమాట.ఈ స్థాయిలో కాకున్నా రావెల కిశోర్‌బాబు స్వరంలోనూ సణుగుడు వుంది. ఇక జలీల్‌ ఖాన్‌ విషయంలోనూ ఊరించి ఉస్సూరనిపించినట్టే. ఇద్దరు మహిళలను తొలగించి ఒక కొత్తమ్మాయిని తీసుకున్నంత మాత్రాన మహిళా ప్రాతినిధ్యం సరిపోదు కూడా. వీరే గాక మరో ముగ్గురు నలుగురు ఎంఎల్‌ఎలు కూడా బహిరంగంగానే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తిరుగులేని పరిస్థితిలో వుందనుకుంటే వారింతగా బయిటపడే వారు కాదు. లోలోపల కుతకుత వుడుకుతున్న అసంతృప్తి కొంతమంది చుట్టూనే కథ తిరుగుతుందనే ఆగ్రహం ఈ పరిణామానికి దారితీశాయి.ఇక ఫిరాయింపుదారులకు సగం పదవులు ఇవ్వడంపై అందరిలోనూ తీవ్రమైన కోపం వుంది. ఈ స్తితిలో చంద్రబాబు ఎలా సర్దుబాటు చేసినా లోలోపల వారి అసంతృప్తి రగులుతూనే వుంటుందన్నది స్పష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close