ఎర్రచందనం స్మగ్లింగ్: ఏపీ టు చైనా వయా ఎంపీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌నుంచి ఎర్రచందనాన్ని పెద్దఎత్తున చైనాకు స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్‌లు మధ్యప్రదేశ్‌ను స్టాకింగ్ కేంద్రాలు నిర్వహించటానికి ఉపయోగించుకుంటున్నారు. మధ్యప్రదేశ్ అటవీశాఖకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల పులులను అక్రమంగా వేటాడుతున్న తమంగ్ అనే ఒక అడవి దొంగను పట్టుకోగా ఎర్రచందనం స్మగ్లింగ్ వివరాలు బయటకొచ్చాయి. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం ఒక కొత్త ముఠా ఏర్పడిందని, ఈ ముఠా సభ్యులు, ఏపీనుంచి తీసుకొచ్చిన ఎర్రచందనాన్ని చైనాకు తరలించేముందు మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ, కత్ని జిల్లాలలో స్టాక్ చేస్తున్నారని తమంగ్ చెప్పాడు. నేపాల్‌కు చెందిన తమంగ్‌ను ఢిల్లీలో పులిచర్మాలు, అలుగు అనే జంతువు వంటిపైఉండే పొలుసులను అమ్ముతుండగా నిఘావేసి పట్టుకున్నారు. అతనిని ఇంటరాగేట్ చేస్తుండగా ఎర్రచందనం వివరాలు బయటకొచ్చాయి. దీనితో ఆశ్చర్యపోయిన అధికారులు ఈ సమాచారాన్ని ఏపీ పోలీసులకు తెలిపారు. తమంగ్‌ను విచారించటంకోసం ఏపీ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు భోపాల్ వెళ్ళారు.

ఆంధ్రప్రదేశ్‌నుంచి ఈ ఏడాది సుమారు 2,000 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లర్‌లు విదేశాలకు తరలించినట్లు ఒక అంచనా. స్మగ్లర్లు ఎర్రచందనాన్ని ఆకాశం లేదా సముద్ర మార్గాలద్వారా దుబాయ్‌కు, అక్కడనుంచి పాకిస్తాన్‌కు, అక్కడనుంచి చైనాకు తరలిస్తున్నారని సమాచారం. మరోవిధంగా పశ్చిమ బెంగాల్, బాంగ్లాదేశ్, బర్మా మార్గంలోకూడా చైనాకు తరలిస్తున్నారని అంటున్నారు.

పులుల వేటగాడు తమంగ్‌కుకూడా చైనాలోని అనేక ముఠాలతో సంబంధాలున్నాయని అటవీశాఖ అధికారుల విచారణలో తేలింది. అతని బ్యాంక్ ఖాతాలలో లక్షల్లో పెద్ద పెద్ద మొత్తాలు డిపాజిట్ అవుతున్నట్లు తాము గమనించామని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శాఖకు దీనిగురించి తెలిపామని అధికారులు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close