తెలకపల్లి వ్యూస్ : కెసిఆర్‌ చక్రం -ఎలా? ఎవరిపై?

చంద్రబాబు నాయుడు తరచూ తాను కేంద్రంలో చక్రం తిప్పిన రోజులు గుర్తుచేస్తుంటారు. మరో చంద్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఇప్పుడు అదే పల్లవి అందుకున్నారు. ప్రాంతీయ పార్టీల మాటే చెల్లుతుందని జాతీయ పార్టీల పాత్ర తగ్గుముఖం పట్టిందని స్పష్టంగా చెప్పేశారు. కమ్యూన్ణిస్టులు కూడా ప్రాంతీయ పార్టీలుగా మారాయన్నారు. తాను కొందరు జాతీయ నాయకులతో మాట్లాడానని, 80 మంది ఎంపిలతో ఒక ప్రెషర్‌ గ్రూపు ఏర్పాటు చేసి చక్రం తిప్పుతానని ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలో అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ముఖ్యమంత్రులు మాజీలు కొందరు ఆ వాదనకు ఆచరణ రూపమన్నట్టు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు గురించి మాట్లాడారు. మమతా బెనర్జీ ఈ కూటమికి నాయకత్వం వహించాలన్నట్టు మాట్లాడారు. ఆమె ఔను కాదనకుండా తాను చాలా చిన్నదాన్నని తన వల్ల కావలసిన సహాయం ఏదైనా చేస్తానని మనోభీష్టం వెల్లడించుకున్నారు.ఈ సందర్భంలో యుపి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ (సమాజ్‌వాది)బీహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ (జెడియు) ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(ఆప్‌) ఇతరులూ హాజరైనారు.

2009 ఎన్నికల్లోనే మొదటిసారి కాంగ్రెస్‌ 200 స్థానాలకు మించి తెచ్చుకోగలిగింది. 2014లో మొదటిసారిగా బిజెపి స్వంతంగా పూర్తి మెజార్టి(290) స్థానాలు పొందింది. అయితే అప్పుడు కాంగ్రెస్‌ ఇప్పుడు బిజెపి కూడా రాష్ట్రాలలో ఓడిపోతూనే వున్నాయి. మొన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికలే తీసుకుంటే బిజెపికి63,కాంగ్రెస్‌కు 115 స్థానాలు రాగా ఇతర పార్టీలకు 643 స్థానాలొచ్చాయి. బిజెపికి 60 వచ్చిన అస్సాంలో మాత్రం అధికారం దక్కగా కాంగ్రెస్‌కు రెండు చోట్ల వున్నఅధికారం పోయింది.ఇంతకన్నా విస్త్రతమైన మరో లెక్క ప్రకారం గత నాలుగేళ్లలో 30 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 4117 సీట్లకు పోటీ జరిగితే బిజెపి 1051, కాంగ్రెస్‌ 871, మాత్రమే తెచ్చుకున్నాయి.అంటే బిఎస్‌పి వామపక్షాలతో కలిపి చూస్తే మిగిలిన పార్టీలకే 2195 స్థానాలు వచ్చాయి. 465 స్థానాలు కాంగ్రెస్‌,బిజెపియేతర పార్టీలకే వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇందులో కమ్యూనిస్టులను మినహాయిస్తే మిగిలిన పార్టీలన్నీ ఆర్థిక విధానాలలో కాంగ్రెస్‌ బిజెపిల నమూనానే అనుసరిస్తాయి.అంతేగాక ఎప్పుడో ఒకప్పుడు ఈ రెండు పార్టీలలో ఒకదానితో జతకట్టి అధికారం పంచుకున్న చరిత్ర వీటిది. ఇప్పుడు కూడా అలా చేస్తున్న పార్టీలు వున్నాయి.

టిఆర్‌ఎస్‌ తమ ప్రభుత్వంలో చేరేందుకు ఆ పార్టీ అభ్యర్థన పంపలేదని ని బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా హైదరాబాదులో చెప్పారు.కెసిఆర్‌ దీనిపై రాజకీయంగా స్పందించకుండా తెలంగాణ కోణంలో విమర్శలకే పరిమితమైనారు,ఆంధ్ర ప్రదేశ్‌ పాలకపక్షమైన తెలుగుదేశం ఇప్పటికే బిజెపి భాగస్వామిగా వుంది. ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరూ బిజెపి మతరాజకీయాలను గాని, అసహన వ్యవహారాలను గాని ఖండించింది లేదు. కనుక ఎవరితో కలసి ఎవరికి వ్యతిరేకంగా ఏ ప్రాతిపదికన ఎవరి నాయకత్వంలో ఏర్పడుతుందనే సందేహం కలుగుతుంది.

80వ దశకం చివరలో జాతీయ స్తాయిలో జ్యోతిబాసు,విపిసింగ్‌,హరి కిషన్‌సింగ్‌ సూర్జిత్‌, ఎన్టీఆర్‌ వంటివారి చొరవతో ఏర్పడిన బిజెపి రహిత కూటముల వల్ల చాలా సత్పలితాలు కలిగాయి. దేవగౌడ ప్రధాని అయినా, చంద్రబాబు నాయుడు జాతీయ కన్వీనర్‌ అయినా అది ఈ మహానేతల ఆశీస్సులు అండదండలతోనే అని మర్చిపోలేము. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని చంద్రబాబు చెప్పేది కూడా ఆ దశను గురించే.1998లో ఆయన బిజెపితో చేతులు కలిపిన తర్వాత మళ్లీ ఆ ప్రతిష్ట రానేలేదు.

లౌకిక ప్రజాస్వామిక విలువలు ప్రజానుకూల ఆర్థిక విధానాలు లేకుండా ఏ కలయికలు దేశాన్ని గట్టెక్కించలేవు.ఏ కొలబద్ద లేకుండా గతంలో ఇలాగే ప్రాంతీయ పార్టీల కూటములు ఏర్పాటు చేసేందుకు జరిగిన ప్రయత్నాలు ఘోరంగా దెబ్బతిన్నాయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే పాలక పార్టీలు ఆఖరుకు అన్ని కుంభకోణాల మధ్య పరస్పరం సర్దుకుంటూనే వుంటాయని నడుస్తున్న చరిత్ర చెబుతున్నది. ఆయా నేతల అధికార కాంక్షలూ అవకాశవాదాలూ కనీస ఐక్యతకు కూడా ఆటంకమవుతుంటాయి. నిన్న గాక మొన్న జనతా పరివార్‌ విలీనంపై నడిచిన ప్రహసనం చూశాం. చక్రం తిప్పాలనే ఆకాంక్ష మంచిదే గాని దానికి ఏవో విధాన ప్రాతిపదికలు, నాయకత్వం వహించేవ్యక్తులు వుండక తప్పదు.

ప్రాంతీయ అన్న పదాన్ని తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. పార్టీల విధానాలు ముఖ్యం తప్ప ప్రాంతీయమా జాతీయమా అన్నది మౌలికం కాదు. ఎన్నికల సంఘం లెక్కలో ఇవన్నీ రాష్ట్ర స్థాయి పార్టీలు. భారత దేశం అనేక రాష్ట్రాల కలయిక తప్ప ఏ ఒక్క రాష్ట్రమో నిర్దేశించదగింది కాదు..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close