విడాకులు తీసుకోకముందే పవన్ వేరే యువతితో బిడ్డను కన్నారు : రేణుదేశాయ్..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఓ సంచలనాత్మకమైన విషయాన్ని ఆయన రెండో భార్య రేణుదేశాయ్ వెల్లడించారు. తను మళ్లీ పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో.. ఓ ఇంటర్యూను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. పదకొండేళ్ల పాటు కాపురం చేసిన పవన్ కల్యాణ్ తనకు తెలియకుండా… వేరే యువతితో ఎఫైర్ పెట్టుకుని.. ఓ బిడ్డను కన్నారని…ఆ ఇంటర్యూలో రేణుదేశాయ్ వెల్లడించారు. అందువల్లే విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ , రేణుదేశాయ్ విడిపోయినట్లు బయటకు తెలిసిన సమయంలో… చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయం చాలా కాలం బయటకు రాలేదు. పవన్ కల్యాణ్ కూడా ఎప్పుడూ చెప్పలేదు. రేణు దేశాయ్ కూడా… చెప్పుకోలేదు.

కానీ ఇప్పుడు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే.. తను పవన్ కల్యాణ్‌తో ఎందుకు విడిపోయానో బయటకు చెప్పారని భావిస్తున్నారు. విడాకులు తీసుకుందామన్న ప్రతిపాదన కూడా పవన్ కల్యాణే పెట్టారని..రేణుదేశాయ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను ఎంతో మథనపడ్డానని చివరికి పిల్లల భవిష్యత్ కోసం… విడాకులు తీసుకోవాలనుకున్నానన్నారు. రెండో పెళ్లికి సంబంధించి తను ఎదుర్కొంటున్న మానసిక వేదనను అందరి ముందు పెట్టడానికి.. ఆమె ఓ ప్రముఖ జర్నలిస్టుకు ఇంటర్యూ ఇచ్చారు. రెండో పెళ్లి చేసుకునే విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారో అన్న విషయాన్ని కూడా బయటపెట్టారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర్నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని అందుకే కాబోయే భర్త వివరాలను కూడా రహస్యంగా ఉంచాల్సి వస్తోందన్నారు. కాబోయే భర్తకు సినిమా రంగంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమేనన్నారు. తన జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తిని..పిల్లలు ఆహ్వానిస్తున్నారని..రేణుదేశాయ్ చెప్పారు. పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడాలన్న ఉద్దేశంత తనకు లేదని రేణుదేశాయ్ స్పష్టం చేశారు.

అయితే రేణు దేశాయ్ ఇంటర్యూ..ముఖ్యంగా విడాకులకు దారి తీసిన ఇష్యూ… పెద్ద సంచలనం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నో సిద్ధాంతాలు వల్లిస్తూ ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో దానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు.. రేణుదేశాయ్ ఇంటర్యూలో వెల్లిడించడంతో..ఇతర పార్టీల నేతలు ఈ అవకాశాన్ని వదిలి పెట్టే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close