రేణుదేశాయ్ రెండో పెళ్లి కబుర్లు..! ఎవర్నీ రెచ్చగొడుతున్నట్లు..?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.. రెండో పెళ్లికి రెడీ అయిపోయారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసేశారు. కొద్ది రోజుల క్రితం తన చేతిని మరొకరి చేతిలో ఉంచిన ఫోటో పోస్ట్ చేసి… పెళ్లికి రెడీ అయినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. నిన్నటికి నిన్న.. తన బాయ్‌ ఫ్రెండ్ పెట్టే మెసెజ్‌లను మురిపెంగా చూసుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసి.. కాస్తంత చిలిపి కామెంట్లు పెట్టారు. నిజానికి రేణుదేశాయ్ ఓ స్ట్రాటజీ ప్రకారమే.. రెండో పెళ్లి విషయాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. మొదట్లో ఓ డాన్స్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించినప్పుడు… తనకు తోడు అవసరమని గట్టిగా చెప్పారు. తన పెళ్లికి పిలుస్తానని.. షోలో పార్టిసిపెంట్లకు హామీలు కూడా ఇచ్చేశారు.

ఆ తర్వాత ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఇంటర‌్యూ ఇచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానన్నారు. కానీ ఎవర్నీ చేసుకుంటానో తెలియదన్నారు . రేణుదేశాయ్ తీరు చూస్తూంటే.. ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్లతోనే ప్రేమలో పడిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌ రేణు దేశాయ్‌కు విడాకులిచ్చిన తర్వాత అన్నాలెజ్‌నోవాను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం.. రేణుదేశాయ్ పెళ్లి చేసుకుంటానంటే.. సహించలేకపోయారు. సోషల్ మీడియాలో ఆమెపై తిట్ల వర్షం కురిపించారు. దానికి ఆమె ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. అలాంటి ఫ్యాన్స్ అందర్నీ మానసికంగా సిద్ధం చేయడానికే.. రేణుదేశాయ్ ఇప్పుడు… ఇలా వరుసగా తన రెండో పెళ్లికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోందన్న అంచనాలున్నాయి.

మూడు రోజుల కిందట.. కుమారుడు అకిరానందన్ ఫోటో పోస్ట్ చేసి… జూనియర్ పవన్ కల్యాణ్ అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలా ఎందుకన్నారో ఎవరికీ అర్థం కాలేదు. అయితే.. ఆ అకిరానందన్ మూడు రోజుల తర్వాత.. పవన్‌కల్యాణ్‌తో కలిసి విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. పవన్ కల్యాణ్ విజయవాడలో కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంట్లో పూజలు చేసి సమయంలో అకిరా కూడా పవన్‌తో పాటే ఉన్నారు. అంటే… రేణుదేశాయ్‌.. రెండో పెళ్లి… పిల్లల విషయంలో ఏమైనా తేడాలొచ్చాయా..? అందుకే రేణు దేశాయ్ ఇలాంటి పోస్టులు పెడుతున్నారా అన్న అనుమానాలు పవన్ ఫ్యాన్స్‌లో ప్రారంభమయ్యాయి. ఇదే నిజమైతే.. పవన్ కల్యాణ్ ఫ్యామిలీ సర్కస్‌లో ఇరుక్కుపోతారేమో…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close