‘మ‌హానాయ‌కుడు’.. మ‌హా మ‌ర‌మ‌త్తులు

‘క‌థానాయ‌కుడు’ రిజ‌ల్ట్‌… బాల‌య్య అండ్ కోని గ‌ట్టిగానే దెబ్బ‌కొట్టింది. అంచ‌నాల‌న్నీ త‌ల‌కింద్రుల‌వ్వ‌డంతో – చిత్ర‌బృందం డీలా ప‌డింది. అటు బ‌య్య‌ర్లూ బాగా న‌ష్ట‌పోయారు. ఈ నేప‌థ్యంలో పార్ట్ 2 చూడాల‌న్న ఆస‌క్తిని జ‌నం లో పెంచ‌డం అంత సామాన్య‌మైన విష‌యం కాదు. పార్ట్ 1లోనే గెట‌ప్పులు రివీల్ అయిపోయాయి. జ‌నాల‌కు అత్యంత ఇష్ట‌మైన ‘సినిమా’ ఎపిసోడ్‌… పార్ట్ 1లోనే ముగిసింది. స్టార్లంద‌రినీ ఆ భాగంలోనే చూసేశారు. మెలోడ్రామాకి ఏమాత్రం అవ‌కాశం లేని పార్ట్ 2.. ఇప్పుడు ప్రేక్ష‌కుల్ని ఏమాత్రం ఆక‌ర్షిస్తుంద‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.

పార్ట్ 2 (మ‌హా నాయ‌కుడు)ని జ‌న‌రంజ‌కంగా తీర్చిదిద్ద‌డం క్రిష్ ముందున్న కీల‌క‌మైన స‌వాల్‌. పార్ట్ 1లో చేసిన త‌ప్పుల్ని.. పార్ట్ 2లో రిపీట్ చేయ‌కుండా ఉండాల‌నుకుంటున్నాడు క్రిష్‌. క‌థానాయ‌కుడులో కొన్ని స‌న్నివేశాలు సుదీర్ఘంగా సాగాయి. కంటెంట్ బాగున్నా… లెంగ్త్ ఇబ్బంది పెట్టిన సీన్లు కొన్ని క‌నిపించాయి. అవి పార్ట్ 2లో లేకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు క్రిష్‌. ఆల్రెడీ తెర‌కెక్కించిన స‌న్నివేశాల్ని మ‌రింత ట్రిమ్ చేయాల‌న్న‌ది క్రిష్ ఆలోచ‌న‌. అంతేకాదు.. ఇప్ప‌టికే తీసిన కొన్ని సీన్ల‌ను మ‌ళ్లీ రీషూట్ చేస్తున్న‌ట్టు ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. తీసిన స్న‌నివేశాన్ని కుదించ‌డం అన్ని వేళ‌లా సాధ్యం కాదు. అందుకే మ‌రింత షార్ప్‌గా సీన్‌రాసుకుని. దాన్ని ఇప్పుడు మ‌ళ్లీ రీషూట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ అంతిమ‌యాత్ర‌ని `మ‌హానాయ‌కుడు`లో చూపించాల‌న్న ఉద్దేశం చిత్ర‌బృందానికి లేదు. కానీ.. ఇప్పుడు ఆ స‌న్నివేశాల్ని కూడా జోడిస్తున్నార్ట‌. చిత్రీక‌ర‌ణ‌లో జాప్యం వ‌ల్లే… ఈనెల 14న రావాల్సిన ఈ చిత్రం 22కి వాయిదా ప‌డింద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close