కుల రిజర్వేషన్ల అంతానికి మొదటి అడుగు..! హ్యాట్సాఫ్ మోడీ..!

దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థపై… సుదీర్ఘ కాలం చర్చ జరుగుతోంది. రాజ్యాంగం రాసిన బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా కులం ప్రకారం.. రిజర్వేషన్లు ఇవ్వమని రాజ్యాంగంలో చెప్పలేదు. కుల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పలేదు. కానీ రాజ్యాంగంలో ఉన్నదానికి కులం ప్రకారం రిజర్వేషన్లే కరెక్ట్ అని ప్రకారం రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్నాయి. కులం ప్రకారం రిజర్వేషన్లు కరెక్ట్ కాదని.. ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లు గట్టిగా ఉన్నాయి. కానీ ఇవి… అగ్రవర్ణాలకు అనుకూలం అన్న పద్దతిలో ఉండటంతో… ఎవరూ మద్దతు పలకడానికి ముందుకు రాలేదు.

కులం ప్రకారం రిజర్వేషన్ల అంతమే లక్ష్యం..!

ఓ ఐఏఎస్ రిజర్వుడు కేటగిరి. ఆయన దిగువ కుటుంబం నుండి వచ్చి ఉండవచ్చు. కానీ ఐఏఎస్ అయిన తర్వాత ఆయన జీవన ప్రమాణాలు ఎంతో మెరుగు పడ్డాయి. ఇంకా ఆయన కుటుంబానికి రిజర్వేషన్ అవసరమా..?. ఎంతో మంది ఆయన సామాజికవర్గమే కాదు.. ఉన్నత వర్గాల్లోనూ.. అంత కంటే దుర్భరమైన పరిస్థితుల్లో సరైన విద్యా సౌకర్యాలు లేకపోయినా కష్టపడి చదువుకున్న వారికి అవకాశాలు అక్కర్లేదా..?. ఈ ప్రశ్న రిజర్వేషన్లపై ఎన్నో మౌలికమైన ప్రశ్నలను తలెత్తేలా చేస్తుంది. అందులో సందేహం లేదు. కులం ప్రకారం… పదే పదే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ.. ఆర్థికంగా ఎంతో ఎదిగిన కుటుంబాలు దేశంలో లక్షలు ఉండవచ్చు. కానీ అదే అగ్రవర్ణం పేరుతో పేదరికంలో అలమటిస్తున్న వారు కూడా అంత కంటే ఎక్కువే ఉంటారు. అగ్రవర్ణాలు కాకపోయినా… ఆ రిజర్వుడు సామాజికవర్గంలోని పేదలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందని పరిస్థితులు ఉన్నాయి. అందుకే.. ఎవరికైనా.. రిజర్వేషన్ లాంటి ప్రయోజనాలు కల్పించాలంటే… కులం కాదు.. ఆర్థిక, సామాజిక పరిస్థితులు చూడాలనేది నిపుణుల అభిప్రాయం.

ఆరెస్సెస్ ఎజెండానే కావొచ్చు..కానీ మంచిదేగా.. !

కులాల పరంగా రిజర్వేషన్లను ఆరెస్సెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటోంది సంఘ్… ఇపుడు బీజేపీ నిర్ణయం కూడా అదే బాటలో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో కులాల వారీగా రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతున్న సమయంలో… మోడీ మొత్తం వ్యవస్థను కదిపారు. జనాభా పరంగా రిజర్వేషన్లు పెంచాలంటూ పలు రాష్ట్రాల సీఎంలు డిమాండ్లు చేస్తున్నారు. దేశంలో సుమారు 65 శాతం జనాభా ఉన్న రాష్ట్రాలు రిజర్వేషన్లను పెంచాలంటున్నాయి. ఏపీలో కాపులు, గుజరాత్ లో పటేళ్లు…బ్రహ్మణులు, క్రిస్టియన్లు… ఇలా అగ్రకులాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటికీ ఇదే పరిష్కారం కాకపోవచ్చు.. మొదటి అడుగు మాత్ర పడినట్లే భావించాలి.

బీజేపీ చిత్తశుద్ధిపైనే అసలు అనుమానాలు..!

భారతీయ జనతా పార్టీది మొదటి నుంచి విభజించు పాలించు సిద్ధాంతం. ఆ పార్టీ మైనార్టీలపైకి మెజార్టీలను ఉసిగొల్పి.. రాజకీయంగా బలపడింది. అందు కోసం.. అయోధ్య, గోధ్రా వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు శబరిమల పేరుతో కేరళలో జరుగుతున్న వ్యవహారం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలా… అయినా.. బీజేపీ అనుకున్నది సాధించిందా అంటే అదీ లేదు. రామాలయం కట్టలేదు. అగ్రవర్ణాల రిజర్వే,న్లు కూడా ఇలాగే అయ్యే ప్రమాదం ఉంది. సరిగ్గా ఎన్నికలకు ముందు మోదీ తీసుకున్న నిర్ణయం కేవలం రాజకీయం కోసం అయితే.. మహిళా బిల్లులా అది పెండింగ్ లో ఉండిపోతుంది. అదే జరిగితే.. మోడీ అగ్రవర్ణాలను దారుణంగా మోసం చేసినట్లే అవుతుంది.

ఆరంభంతోనే ఆగిపోకూడదు..!

అంతిమంగా ఆరెస్సెస్ స్ట్రాటజీ ప్రకారం… కుల రిజర్వేషన్ల అంతానికి ఇదే మొదటి అడుగుగా భావించాల్సి ఉంటుంది. విజయవంతంగా… కులాలకు అతీతంగా… అగ్రవర్ణాల్లోని పేదలందరికీ.. పది శాతం కోటా అమలు చేస్తే.. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తే.. ఆ తర్వాత.. ఇప్పటికే యభై శాతం వరకూ రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల వారికీ ఇదే పద్దతి అవలంభించే ప్రయత్నాలు చేయవచ్చు. అదే జరిగితే… ఏ కులంలో అయినా.. ఇక ఆర్థిక , సామాజిక వెనుకబాటును మాత్రమే… పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ కల్పించే వ్యవస్థకు రూపకల్పన జరిగిపోయినట్లే భావించాలి. అది భారత భవిష్యత్‌కు కూడా చాలా ముఖ్యం. కానీ మోడీ దీన్ని మంట పెట్టడానికే వాడుకుంటారనేదే ప్రజల భయం..!

——– సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close