ఎడిటర్స్‌కామెంట్ : “భావప్రకటనా స్వేచ్ఛ”పై సూపర్ సెన్సార్

” ప్రభుత్వాలు సంస్కరణలు ఎప్పుడు ప్రారంభిస్తాయో అప్పుడే అతి ప్రమాదకరమైన సమయం ప్రారంభమైనట్లు ”

అని ప్రజాస్వామ్యం ముసుగులో సొంత అజెండాను మలు చేయడానికి ప్రయత్నించే కొన్ని ప్రభుత్వాల గురించి సుప్రసిద్ధ వ్యక్తులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలాంటి అభిప్రాయాలు అవి వారి వారి దేశాల గురించి వ్యక్తం చేసి ఉండవచ్చు…కానీ మొత్తం ప్రపంచానికి ముఖ్యంగా… ప్రజాస్వామ్యం దేశాలకు.. మరీ ముఖ్యంగా ఇండియాలాంటి “మేడిపండు ప్రజాస్వామ్య” దేశాలకు బాగా అన్వయించుకోవచ్చు. ఇండియాను “మేడిపండు ప్రజాస్వామ్య” దేశంగా ఎందుకు అభివర్ణించాల్సి వస్తోందంటే.. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్చ.. స్వాతంత్ర్యాలను ఒక్కొక్కటిగా సంస్కరణల పేరుతో హరించివేయడాన్ని ప్రభుత్వాలు ఓ పనిగా పెట్టుకోవడం వల్లే. కేంద్ర ప్రభుత్వం తాజాగా.. సినిమా రంగాన్ని కట్టడి చేసే ప్రణాళికతో ముందుకు వచ్చింది. దాని కోసం ఓ చట్టం తీసుకు వచ్చింది. ఆ చట్టం అమల్లోకి వస్తే ఇక సినిమాలు .. భజనలే తప్ప భావప్రకటనా స్వేచ్చకు ఓ మార్గంగా ఉండవు.

సినిమాపైనా కన్నేసినా పాలకులు..!

భారత రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్చను ఇచ్చింది. ఆ భావ ప్రకటన ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ మీడియాలలో ఒకటి సినిమా. అది ఒక కళాత్మకమైన, సృజనాత్మకమైన మాధ్యమం. ప్రజల్ని ప్రభావితం చేయగల శక్తి దానికి ఉంది. అందుకే అనేక మంది ఆలోచనా పరులు తమ భావాలను వ్యక్తం చేయడానికి సినిమా మార్గాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు ఆ భావాలను కట్టడి చేయడానికి కేంద్రం రంగంలోకి దిగింది. తమ భావజాలలకు వ్యతిరేకమైన సినిమాలు వస్తున్నాయని…వాటిని కట్టడి చేసేందుకు సంస్కరణలు ప్రారంభించింది. చివరిగా సూపర్ సెన్సార్ బోర్డుగా కేంద్రం మారాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకూ ”సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ ” సినిమాలను సెన్సార్‌ చేసి విడుదలకు అనుమతులిస్తోంది. ఒకసారి సెన్సార్‌బోర్డు అనుమతి పొందిన తరువాత ఆ సినిమా ప్రదర్శనలో ఎవరు ఎలాంటి జోక్యం చేసుకున్నా అది చట్టవిరుద్దమే. చివరికి ప్రభుత్వ జోక్యం కూడా తగదని పలు కోర్టు తీర్పులూ స్పష్టం చేస్తున్నాయి. కానీ తమకు అభ్యంతరమనుకుంటే ఏకపక్షంగా, నేరుగా జోక్యం చేసుకునే హక్కును తనకు దఖలు పరుచుకుంటూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణకు నిర్ణయించింది. మిగతా వాటి సంగతేమో కానీ.. ఆ సవరణల్లో ”రివిజన్‌ ఆఫ్‌ సర్టిఫికేషన్‌” అనే ప్రతిపాదన ఉంది. అసలు దీని కోసమే కేంద్రం ఆ చట్ట సవరణ చేస్తోంది. దీని ద్వారా ఏ సినిమా విడుదల కాకుండా ఆపాలనుకున్నా… అది కేంద్రం ఇష్టం అవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఇష్టం అవుతుంది. ఎవరూ అడ్డుకోవడానికి అవకాశం ఉండదు.

ఇప్పటి వరకూ మూకదాడులు.. ఇక ప్రభుత్వం దాడులు..!

దేశంలో జరుగుతున్న మోరల్ పోలీసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడేళ్ల కాలంలో దేశంలోని ఇతర వ్యవస్థలపై ఎలా దాడులు జరిగాయో.. సృజనాత్మక రంగమైన… సినిమాపైనా అంతే దాడులు జరిగాయి. తమకు నచ్చకపోతే చాలు.. తమ భావజాలానికి అభ్యంతరకరమైతే చాలు.. సినిమా షూటింగ్‌ల మీద దాడులు చేస్తున్నారు. నటుల్ని కొడుతున్నారు. ”వాటర్‌” నుంచి ”పద్మావతీ” దాకా ఇందుకు అనేక ఉదాహరణలు ఇంకా వార్తల్లోనే ఉన్నాయి. వారికి పై స్థాయి నుంచి లభించిన మద్దతు కూడా అందరికీ తెలుసు. ఇక ప్రభుత్వమే నేరుగా కన్నెర్ర చేసిన సినిమాల గురించీ విన్నాం. ప్రభుత్వ విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే.. దానిపై దేశ వ్యతిరేక ముద్ర వేయడం కామన్‌గా మారిపోయింది. తమిళంలోవిజయ్ సినిమాల్లో కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించే మాదిరిగా డైలాగులు పెడుతున్నారని.. ఆయనపై.. ఆయన సినిమాలపై జరిగిన దాడుల గురించి ఎవరైనా మర్చిపోగలరా..?. ప్రభుత్వం చేయదల్చుకున్న కొత్త చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వ విధానాలనూ నిరంకుశత్వాన్నీ ప్రశ్నించేలా ఉన్నవాటిని నిషేధిస్తారు. సినిమా ఎంతగా వ్యాపారమైపోయినప్పటికీ, వాణిజ్య చిత్రాలదే అగ్రభాగమైనప్పటికీ గొప్ప సినిమాలూ వస్తూనే ఉన్నాయి. సమాజంలో మార్పు కోసం .. చైతన్యం కోసం ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. వస్తాయి కూడా. ఇకపై అలాంటి సినిమాలు రాకుండా అడ్డుకోవడమే కేంద్రం కొత్త చట్టం లక్ష్యం. అందుకే… ఉత్తర, దక్షిణాది నుంచిమూడు వేల మందికి పైగా సినీ ప్రముఖులుతమ సంతకాలతో నిరసన లేఖను ప్రభుత్వానికి పంపారు. కానీ కేంద్రం వెనక్కితగ్గుతుందని ఎవరూ అనుకోవడం లేదు.

మీడియా, సోషల్ మీడియా.. సినిమా… అన్ని చోట్లా గొంతునొక్కడమే..!

ప్రభువులు నిరంకుశులైనప్పుడు ఏ రంగంలోనైనా ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలే ఎదురవుతాయి. భారత రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాథమిక స్వేచ్ఛలో అత్యంత కీలకమైన భావప్రకటనకు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. భావ వ్యక్తీకరణ చేసే ప్రతీ రంగంపైనా దాడి చేస్తున్నారు. తమ అభిప్రాయాలు మాత్రమే ఎక్కడైనా కనిపించాలి.. వినిపించాలన్నట్లుగా చేస్తున్నారు. మొదట మీడియాను టార్గెట్ చేశారు. ఇప్పుడు దేశంలో ఏకపక్షంగా ఉన్న మీడియానే అందరికీ కనిపిస్తోంది..వినిపిస్తోంది తప్ప… ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల ప్రజలకు జరిగే మంచిచెడులను విశ్లేషించే మీడియా లేదు. అలా విశ్లేషిస్తున్న వారిపై దేశద్రోహ ముద్ర వేయడం ఎప్పుడో ప్రారంభమయింది. మీడియా కన్నా బలంగా మారుతున్న సోషల్ మీడియాను కట్డడి చేయడానికి కేంద్రం ఏం చేస్తుందో.. ఏం చేయబోతోందో కళ్ల ముందు కనబడుతూనే ఉంది. ఏ సోషల్ మీడియాను ఉపయోగించుకుని తాము ఎదిగామో.. అదే ఫార్ములాను ఇతరులు ప్రయోగిస్తే.. తమకు ఇబ్బంది అని భావిస్తున్నారు. అందుకే కట్టడి ప్రారంభించారు. ఇప్పటికే ఒక్కట్విట్టర్ మినహా అన్నీ కేంద్ర ప్రభుత్వం దారిలోకి వచ్చాయి. ట్విట్టర్ నూ దారికి తెచ్చుకునేందుకు మార్గం సుగమం అయింది. ఇప్పుడు సినిమాల సంగతీ చూసేస్తున్నారు. అంటే… ఇక బీజేపీ భావజాలం మాత్రం ఎక్కడైనా కనిపించాలి.. వినిపించాలి.. లేకపోతే అది దేశద్రోహం అవుతుంది.

ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజల కొరకు నడపబడేదే ప్రజాస్వామ్య ప్రభుత్వం. కొంత మంది ప్రజల కోసం… భిన్నాభిప్రాయాలున్న వారిని అణగదొక్కే చట్టాలు తీసుకు రావడం… ప్రజాస్వామ్య ప్రభుత్వాల లక్షణం కాదు. మంచో చెడో ప్రజలు నిర్ణయించుకుంటారు. మంచీ.. చెడు రెండూ చెప్పే అవకాశం మీడియాకు కల్పించాలి. అప్పుడే అందరికీ వాస్తవాలు తెలుస్తాయి. ఒక వైపు మాత్రమే నిజం అని .. తమ వాదనే చెప్పడం ప్రారంభిస్తే.. చివరికి అది ప్రజాస్వామ్య పతనానికి కారణం అవుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తూంటే.. భారత్ ఆ దిశగానే ఉందని.. సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close