రేవంత్ విమ‌ర్శ‌ల్లో ఆ పాయింట్ ఆలోచించద‌గ్గ‌దే!

ప్రియాంకా రెడ్డి అంశ‌మై రాజ‌కీయ పార్టీల నాయ‌కులంతా స్పందిస్తున్నారు. ప్ర‌భుత్వంపై, పోలీసు శాఖ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇది ముఖ్య‌మంత్రి వైఫ‌ల్య‌మ‌నీ హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఆయ‌న చెడ్డ‌పేరు తెస్తున్నారంటూ భాజ‌పా అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శించారు. ఇంత దారుణ ఘ‌ట‌న జ‌రిగితే ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు ఈ ప్ర‌భుత్వానికి బుద్ధి చెబుతారంటూ విమ‌ర్శించారు. ఇత‌ర పార్టీల నేత‌లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌ల్కాజ్ గిరీ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇలాంటి సంద‌ర్భంలో రాజ‌కీయ పార్టీల విమ‌ర్శ‌లు సాధార‌ణంగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని ఎత్తి చూపేవిగా మాత్ర‌మే ఎక్కువ‌గా ఉంటాయి. అయితే, ఇలాంటివి పున‌రావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే సూచ‌నలు చెయ్యాల్సిన సంద‌ర్భం ఇది. రేవంత్ రెడ్డి స్పంద‌న‌లో ఇలాంటిదే ఒక పాయింట్ ఉంది.

అంతర్జాతీయ విమానాశ్ర‌యానికి కూత‌వేటు దూరంలో, సైబ‌రాబాద్ డీసీపీ ఆఫీస్ కి దగ్గ‌ర్లో ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం సిగ్గుచేటు అన్నారు రేవంత్ రెడ్డి. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు విఫ‌లం చెంద‌డానికి కార‌ణం పాల‌కుల తీరే అన్నారు. నేర‌స్థుల ప‌ట్ల నిత్యం నిఘా పెట్టి చ‌ర్య‌లు తీసుకోవాల్సిన పోలీసు వ్య‌వ‌స్థ మొత్తాన్ని రాజ‌కీయ అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వాడుకుంటున్నార‌న్నారు. ఇత‌ర పార్టీల నాయ‌కుల‌పై నిఘా పెట్టేందుకు పోలీసు వ్య‌వ‌స్థని ముఖ్య‌మంత్రి కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నార‌న్నారు. ఈ కార‌ణం వ‌ల్ల‌నే తాగుబోతులు, తిరుగుబోతులు, నేర‌స్థుల‌పై నిఘా కొర‌వ‌డింద‌నీ, విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నార‌న్నారు. ఈ దారుణ‌ సంఘ‌ట‌న‌కు నేర‌స్థులు ఎంత బాధ్యులో, పోలీసులూ సీఎం కేసీఆర్ కూడా అంతే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు.

తిరుగుబోతులూ తాగుబోతుల‌పై‌ నిఘా అన్న‌ది ఆలోచించద‌గ్గ‌దే అనొచ్చు. ఈరోజుల్లో ప్ర‌జ‌ల డేటా అంతా ప్ర‌భుత్వం ద‌గ్గ‌రుంది. దాని ఆధారంగా గ్రామాల్లో, ప‌ట్టణాల్లో ప‌నీపాటా లేకుండా ఖాళీగా ఉన్న‌వారు ఏం చేస్తున్నారూ అనేది నిత్యం ఓ క‌న్నేసి ఉంచాలంటే పోలీసుల‌కు పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. నిరంత‌రం తాగుతూ రోడ్ల‌పై క‌నిపించేవాళ్లంతా ఏం చేస్తుంటారు అనే నిఘా పెడితే మంచిదే. గ్రామాల్లో, ప‌ట్ట‌ణ వీధుల్లో ఇన్ఫార్మ‌ర్ల‌ను పోలీసులు పెద్ద సంఖ్య‌లో ఏర్పాటు చేసుకుని, ఈ తాగుబోతూ తిరుగుబోతుల‌పై నిరంత‌రం ఓ క‌న్నేసి ఉంచితే చాలావ‌ర‌కూ ఇలాంటి వారిని రోడ్ల మీదికి రాకుండానే ముందుగానే క‌ట్ట‌డి చెయ్యొచ్చు. రేవంత్ విమ‌ర్శ‌ల్లో మ‌రో పాయింట్… పోలీసులంటే నాయ‌కుల‌పై నిఘా పెట్టేందుకు మాత్ర‌మే అధికార పార్టీ వాడుకుంటుందని. సామాన్యుల్లో కూడా దాదాపు ఇలాంటి అస‌హ‌న‌మే ఉంది. ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడు చెయ్యాల్సిన న్యాయంపై ఎంత‌గా ఇప్పుడు మాట్లాడుతున్నారో, ఇలాంటి జ‌ర‌క్కుండా ఉండాల్సిన చ‌ర్య‌ల‌పై కూడా అంతే తీవ్రంగా ఆలోచించాల్సిన స‌మ‌యం ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close