ఫామ్‌హౌస్ లొల్లి : రేవంత్ గొడవేనా.. కేటీఆర్ వాదన వినరా..!?

హైదరాబాద్ శివార్లలో జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు… నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు..  ఎన్జీటీ ఈ నోటీసులు జారీ చేసింది. దాంతో.. కాంగ్రెస్ నేతలు ఒక్క సారిగా గొంతు సవరించుకున్నారు. కేటీఆర్ రాజీనామా చేయాలని… అలా చేస్తేనే.. ఎన్జీటీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని అంటున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతల ఆరోపణల్ని.. మంత్రి కేటీఆర్ ఒక్క ట్వీట్‌తో తోసి పుచ్చారు. తనది అని చెబుతూ.. ఎన్జీటీలో పిటిషన్ వేశారని.. కాను ఆ ఫామ్ హౌస్ తనది కానే కాదని.. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని.. కేటీఆర్ హెచ్చరించారు.

కేటీఆర్ వాదన ప్రకారం.. ఆ ఫామ్‌హౌస్ ఆయనది కాదు. ఆయనది కానప్పుడు.. ఆయనకు నోటీసులు వచ్చినా… చేయగలిగిందేమీ లేదు. అది తనది కాదని.. ఓ లేఖను ఎన్జీటీకి పంపిస్తారు. దాంతో ఇష్యూ క్లోజ్ అయిపోతుంది.. ఆ ఫామ్‌హౌస్ ఎవరిది..? జీవో 111కి ఉల్లంఘించి కట్టారా లేదా అన్న ఇతర విషయాలను ఎన్జీటీ విచారణ జరుపుతుంది. అయితే.. ఇక్కడ రాజకీయం అంతా.. కేటీఆర్‌ను టార్గెట్‌ చేసుకుని ఆ ఫామ్‌హౌస్ కేంద్రంగా నడుస్తోంది. అది ఆయనదే అని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ ఫామ్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నామని కేటీఆర్ సంబంధీకులు చెబుతున్నారు. కాదు.. అది ఆయన సొంతమేనని నిరూపిస్తానని.. రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు జన్వాడ ఫామ్‌హౌస్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చిన్న సందు దొరికినా.. ఆయన దానిపై ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు… కేటీఆర్.. తనపై చేస్తున్న ఆరోపణలను డిఫెండ్ చేసుకోవడానికి రంగంలోకి దిగారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిసైడయ్యారు. ఆ ఫామ్‌హౌస్ తనది కాదని.. నిరూపించి.. రేవంత్‌పై కేటీఆర్ మరో కేసు పెడతారేమో వేచి చూడాలి..!  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close